టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న వర్థమాన తారలు చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. గత 20 ఏళ్లలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా తెలుగు సినిమా పరిశ్రమకు బాగా పరిచయం ఉన్న 12 మంది వర్థమాన హీరోలు, హీరోయిన్లు అనూహ్యంగా చనిపోయారు. ఎంతో భవిష్యత్తు ఉండి కూడా చిన్న వయస్సులోనే చనిపోయిన కొందరు హీరోలు, హీరోయిన్లను చూద్దాం.
1- దివ్యభారతి :
టాలీవుడ్‌లో మూడు దశాబ్దాల క్రితం వరుస హిట్లతో ఓ ఊపు ఊపేసింది దివ్యభారతి, రౌడీఅల్లుడు, బొబ్బిలిరాజా, అసెంబ్లీరౌడీ, ధర్మక్షేత్రం ఇలా మంచి సినిమాలు చేసిన ఆమె ముంబైలో ఓ అపార్ట్‌మెంట్ పై నుంచి జారిపడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అప్పటికే ఆమె నిర్మాత సాజిద్ నడియడ్‌వాలాను ప్రేమ వివాహం చేసుకుంది.
2- సౌందర్య :
తెలుగు సినిమాను ఒక ఊపు ఊపేసిన సౌందర్య అందరు స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కెరీర్ ముగిశాక తన సొంత మేనబావనే ఆమె పెళ్లి చేసుకుంది. అయితే 2004 ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థిగా కరీంనగర్‌లో పోటీచేస్తోన్న విద్యాసాగర్‌రావు ఎన్నికల ప్రచారంకు వెళుతూ హెలీకాఫ్టర్ కూలిపోయి దుర్మరణం పాలై చిన్న వయస్సులోనే ఈ లోకం విడిచి వెళ్లిపోయింది.
3- ప్రత్యూష :
2000 టైంలో ప్రత్యూష తన అందచందాలతో చకచకా సినిమాలు చేసి దూసుకుపోయింది. సుమంత్, ఉదయ్‌కిరణ్‌కు జోడీగాను, ఇటు మోహన్‌బాబు సినిమాలోనూ నటించింది. అయితే కెరీర్ టాప్ పరంగా ఉన్నప్పుడే అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె స్నేహితుడు సిద్ధార్త్‌రెడ్డిపై అప్పట్లో చాలా అనుమానాలు వచ్చాయి.
4- ఆర్తీ అగర్వాల్ :
టాలీవుడ్‌లో ఒక్కసారిగా టాప్ హీరోయిన్‌గా తారాజువ్వలా ఎదిగింది ఆర్తీ అగర్వాల్. ఆ వెంటనే తరుణ్‌తో ప్రేమ విఫలం కావడం.. కెరీర్ డల్ అవ్వడం.. పెళ్లి విడాకులు.. చివరకు నాజూగ్గా మారేందుకు ఆమె చేయించుకున్న ఆపరేషన్ వికటించి ఆమె మృతిచెందింది.
5- సిల్క్‌స్మిత :
టాలీవుడ్‌లో అప్పట్లోనే ఎంతోమంది కుర్రాల్ల కలల రాణిగా ఉన్న సిల్క్‌స్మిత టాప్ హీరోయిన్లు, హీరోలకు మించిన క్రేజ్‌తో ఉండేది. చిన్న వయస్సులోనే వ్యసనాలకు తోడు, అప్పుల పాలు కావడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
6- ఉదయ్‌కిరణ్ :
చిత్రం – నువ్వునేను – మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ హ్యాట్రిక్ సినిమాలతో ఒక్కసారిగా పాపులర్ అయ్యి స్టార్ హీరోలకు చెమటలు పట్టించాడు ఉదయ్. చిన్న వయస్సులోనే కెరీర్‌లో ఒడిదుడుకులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
7- కునాల్‌సింగ్ :
ప్రేమికుల రోజు సినిమాతో పాపులర్ అయిన కునాల్ కూడా ఫ్యామిలీ ఒత్తిళ్లు తట్టుకోలేక, అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంతో భవిష్యత్తు ఉండి కూడా కునాల్ ఈ లోకం విడిచి వెళ్లిపోయాడు.
8- అష్టాచెమ్మా భార్గవి :
అష్టాచెమ్మా భార్గవి రోడ్డు ప్రమాదంలో చిన్న వయస్సులోనే ఈ లోకం విడిచి వెళ్లిపోయింది.
9- విజయసాయి, 10- యశోసాగర్ :
మంచి భవిష్యత్తు ఉన్న విజయసాయి, యశోసాగర్ కూడా చిన్న వయస్సులోనే మృతిచెందారు.
11- పునీత్‌రాజ్‌కుమార్ :
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఓ సంచలనం. 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి కన్నడలో స్టార్ హీరో అయ్యాడు. అయితే గుండెపోటుతో చిన్న వయస్సులోనే మృతిచెందడం అందరిని కలిచి వేసింది.
12- సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ :
ధోని సినిమాతో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ నేషనల్ పాపులర్ హీరో అయిపోయాడు. అయితే ప్రియురాలు రియా చక్రవర్తి చేసిన మోసంతోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న టాక్ ఉంది.