హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. గత నాలుగైదు సంవత్సరాలుగా సౌత్ నుంచి నార్త్ వరకు ఎంతోమంది స్టార్ హీరోయిన్లు, స్టార్ సింగర్లు, బుల్లితెర హీరోయిన్లు సైతం తమ కెరీర్లో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వరుసగా ఓపెన్ అవుతున్నారు. బాలీవుడ్లో లేడీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ – రాధిక ఆప్టే లాంటి హీరోయిన్లు ముందుగా కాస్టింగ్ కౌచ్ పై గళమెత్తారు. ఆ తర్వాత విద్యాబాలన్ లాంటి హీరోయిన్లు కూడా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పారు.
సౌత్‌లో తాప్సితో మొదలు పెడితే ఎంతో మంది హీరోయిన్లు లైంగిక వేధింపులు గురించి చెప్పారు. ఇక సింగర్ చిన్మయి అయితే కాస్టింగ్ కౌచ్ పై భారీ ఎత్తున గళం ఎత్తింది. అటు శాండిల్ వుడ్ లోను ఎంతో మంది హీరోయిన్లు లైంగిక వేధింపులు.. అవకాశాల కోసం డైరెక్టర్ల పక్కలోకి వెళ్లటాలపై ఎన్నో సంచలన విషయాలు బయట పెట్టారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక నార్త్ హీరోయిన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.
మరాఠీ హీరోయిన్ తేజస్విని పండిట్ తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తన తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. విచిత్రం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను అవకాశాల పేరుతో వాడుకునే దర్శకులు, నిర్మాతలు ఉంటారు. అయితే తేజస్విని పండిట్ ను తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కూడా లైంగిక వేధింపులకు గురి చేశాడట. తేజస్విని ఎవరో కాదు నటి జ్యోతిచంద్ర కుమార్తె కావటం విశేషం.
తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని అయిన కార్పోరేటర్ ఇంటికి వెళితే తనతో గడిపేందుకు డైరెక్ట్ గా రూమ్ కి రమ్మని పిలిచాడని… అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తాను వెంటనే అపార్ట్మెంట్ ఖాళీ చేసి బయటకు వచ్చేసానని చెప్పింది. తను 2009 – 2010 ప్రాంతంలో పూణేలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉన్నానని.. అప్పటికి తాను నటించిన రెండు సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయని.. ఓ కార్పొరేటర్ కి చెందిన అపార్ట్మెంట్లో తాను అద్దెకు ఉండే దానిని చెప్పింది.
తాను అద్దె చెల్లించడానికి అతడి ఆఫీస్ కి వెళితే.. నా రూమ్ కి రావాలని ఆఫర్ ఇచ్చాడని… అక్కడే టేబుల్ మీద ఒక గ్లాసు నీరు ఉంది.. దానిని తీసుకుని అతడి మొఖం మీదకి విసిరికొట్టానని తేజస్విని తెలిపింది. అలాంటి పనులు చేసేందుకు తాను ఈ వృత్తిలోకి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తేజస్విని తెలిపింది. నా ఆర్థిక స్థితి అప్పట్లో బలహీనంగా ఉన్నందువల్లే అతడు ఇలా ప్రవర్తించాడు.. ఇది తన కెరీర్ లో ఒక మరిచిపోలేని అనుభవం అని తేజస్విని తెలిపింది.