మిల్కీబ్యూటీ తమన్నాకు ఎఫ్ 2, 3 సినిమాలు, ఇటు చిరంజీవి భోళాశంకర్ లాంటి సినిమాలు మినహా కుర్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు రావడం లేదు. తమన్నాను అందరూ మర్చిపోతున్నారు అనుకుంటోన్న టైంలో గుర్తుందా శీతాకాలం సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించింది. ఎప్పుడో కన్నడలో రెండేళ్ల క్రితం వచ్చిన లవ్ మాక్టెయిల్ కి రీమేక్ సినిమాగా తెరకెక్కిన ఈ గుర్తుందా శీతాకాలం యేడాది నుంచి వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు సరిగ్గా శీతాకాలం టైంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అసలు సత్యదేవ్ హీరోగా నటించినా కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు ఎందుకు వస్తారా ? అని ప్రశ్నించుకుంటే కేవలం తమన్నా ఉందనే ఆన్సర్ ఇస్తారు. అసలు ఈ సినిమాను తమన్నాను ఎందుకు ఒప్పుకున్నారు అని ప్రశ్నించుకుంటే జవాబు దొరకదు. అసలు ఈ సినిమాలో ఆమె పాత్రలో ఏ మాత్రం లోతులేదు. ఆమెది అంత గుర్తుంచుకునే పాత్ర అయితే కాదు. కన్నడలో ఎలాగూ హిట్ అయ్యింది కాబట్టి… అందుకే ఇక్కడ హిట్ చేసేస్తారు అన్న కారణంతో ఒప్పుకుని ఉంటుంది.
అయితే రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ స్టైల్లో ఉంటుంది. అయితే ఆ సినిమాలో ఉన్నంత ఎమోషన్లు ఇందులో ఉండవు. తన జర్నీలో కనిపించిన ఓ అమ్మాయికి కారులో లిఫ్ట్ ఇచ్చిన హీరో తన గతం చెపుతూ ఉంటాడు. ఈ కథ ఇద్దరమ్మాయిలతో ముడిపడి ఉంటుంది. సింపుల్‌గా సినిమా ఇదే. అయితే ఇందులో పాత్రల మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ ఉండాలి. సున్నితమైన ఫన్ ఉండాలి. అయితే దర్శకుడు ఇవేమి లేకుండా చేతులు దులిపేసుకున్నాడు.
ఇక ఫస్టాఫ్‌లో తమన్నా రోల్ చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. అయితే సెకండాఫ్‌లో ఇదే పాత్ర ఇన్‌సెక్యూర్డ్‌గా మారిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ? ఎవ్వరికి అర్థం కాదు. తమన్నా పాత్ర పూర్తిగా తేలిపోయింది. అసలు తమన్నా కెరీర్‌కు ఈ సినిమా, ఈ పాత్ర ఎందుకూ యూజ్ అవ్వదు. విచిత్రం ఏంటంటే సత్యదేవ్ నటన బాగుంది. నానిలా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా నేచురల్‌గా నటించాడు. మేఘా ఆకాష్ అతిధి పాత్రకి ఎక్కువ పూర్తి పాత్రకి తక్కువ అన్నట్టుంది. ఇక సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు అసలేం గుర్తుండదు అన్న సెటైర్లు పడుతున్నాయి.