Moviesయాక్సిడెంట్ త‌ర్వాత సాయితేజ్‌లో ఇంత మార్పా... హెల్దీగానే ఉన్నాడా...!

యాక్సిడెంట్ త‌ర్వాత సాయితేజ్‌లో ఇంత మార్పా… హెల్దీగానే ఉన్నాడా…!

మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చి త‌క్కువ టైంలోనే మంచి స‌క్సెస్ సాధించాడు. సాయిధ‌ర‌మ్ తేజ్ గ‌త యేడాది జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాల‌కు గుర‌య్యారు. హాస్ప‌టల్లో చికిత్స అనంత‌రం సాయితేజ్ కోలుకుని ఇప్పుఏ సినిమాలు చేస్తున్నాడు. సాయితేజ్ యాక్సిడెంట్‌కు గుర‌య్యాక వ‌చ్చిన రిప‌బ్లిక్ సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు.

దాదాపు ఏడెనిమిది నెల‌లుగా సాయితేజ్ బెడ్ రెస్ట్ తీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుని సినిమాలు చేస్తున్నాడు. ఇక సాయితేజ్ తాజాగా విరూపాక్ష సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్‌. ప్ర‌సాద్‌తో క‌లిసి డైరెక్ట‌ర్ సుకుమార్ త‌న సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌తో రిలీజ్ అయిన ఈ గ్లింప్స్‌లో సాయితేజ్ లుక్ బాగుంది.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. అయితే ఈ స్టిల్లో సాయితేజ్ లుక్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అస‌లు యాక్సిడెంట్‌కు ముందు సాయితేజ్‌కు, ఇప్పుడు స్టిల్‌కు ఏ మాత్రం పోలిక లేదు. బాగా బ‌క్క‌గా అయిపోయి.. ఫేస్‌లో కూడా మునుప‌టి ఛ‌రిష్మా లేదు. ఫేస్ అంతా పీక్కుపోయిన‌ట్టుగా ఉంది. ఈ లుక్ చూసిన మెగాభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఏదేమైనా సాయితేజ్ హెల్దీగానే ఉన్నాడా ? మ‌రింత ఫిట్‌గా మారేందుకు మ‌రి కొంత టైం ప‌డుతుందా ? అన్న చ‌ర్చ‌లు అయితే న‌డుస్తున్నాయి. ఇక రిప‌బ్లిక్ అంచ‌నాలు అందుకోలేదు. అంత‌కుముందు సినిమాలు స‌రిగా ఆడ‌లేదు. ఈ వీరూపాక్ష‌ను వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే సాయి ఫామ్‌లోకి వ‌స్తాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news