Moviesఓరి దేవుడో..వీడు ఇంత దుర్మార్గుడా..? ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..కమెడియన్ కాదు కంత్రీగాడు..!!

ఓరి దేవుడో..వీడు ఇంత దుర్మార్గుడా..? ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..కమెడియన్ కాదు కంత్రీగాడు..!!

సినిమా ఇండస్ట్రీలో తెరపై కనిపించేదంతా నిజం కాదు అని మరోసారి ప్రూవ్ చేశాడు తమిళ్ యాక్టర్ యోగిబాబు. యోగి బాబు నా..ఆయన ఎవరు అనుకుంటున్నారా..? ఈ పేరు చెప్పితే పెద్దగా ఎవరు టక్కున గుర్తుపట్టలేరు.. కానీ ఫోటో చూస్తే మాత్రం ఓ ఈయన మనకు బాగా తెలిసే అనుకుంటారు . అలా డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులోనే పాపులారిటీ సంపాదించుకున్న ఇతగాడి పేరు యోగిబాబు . పలు కామెడీ రోల్స్ లో జనాలను విపరీతంగా నవ్వించే యోగిబాబు ..అసలు స్వరూపం బయటపడింది . ఈ క్రమంలోనే ఈయనను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు.

యోగి బాబు, నితిన్‌ సత్య కథానాయకులుగా, గాయత్రి హీరోయిన్ గా నటించారు. మనోబాలా, నాజర్, సింగం ముత్తు, భువనేశ్వరి, ఉమా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన సినిమా దాదా.
ఎనీ టైం మనీ ఫిలిమ్స్ పతకం పై గిన్నిస్ కిషోర్ కధ మాటలు దర్శకత్వం బాధ్యతలు నిర్వహించి నిర్మించిన చిత్రం డిసెంబర్ 9న గ్రాండ్గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమాను యోగిబాబు అడ్డుకుంటున్నట్లు సినిమా డైరెక్టర్ చెప్పుకోరావడం సంచలనంగా మారింది. యోగిబాబు ఏ విధంగా అయినా సరే సినిమాను అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నాడని తమిళ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

అయితే దానిని కన్ఫర్మ్ చేస్తూ దర్శక నిర్మాత గిన్నిస్ కిషోర్ ఓపెన్ అప్ అయిపోయాడు . స్టేజిపై ఆయన మాట్లాడుతూ ..”ఇందులో యోగి బాబు నటించారు. అడ్వాన్స్ కూడా ముందే చెల్లించాం . అయితే ఈ సినిమాలో నేను నటించింది నాలుగు సన్నివేశాలలోనే.. ఆ సినిమా అని ఎవరు కొనుక్కోవద్దు అంటూ బయ్యర్లకి కాల్ చేసి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారట . నా సినిమాను దెబ్బతీయాలని చూస్తున్నాడు.

 

అతడు నాలుగు సీన్లు నటించాడో 40 సన్నివేశాలు నటించాడో చిత్రం చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది అంటూ మండిపడ్డారు . అంతేకాదు ఈ సినిమా రిలీజ్ కాకుండానే నేను అతనికి వేరే సినిమా కోసం డబ్బులు కూడా ఇచ్చానని.. ఇప్పుడు ఆ సినిమాను చేయనని మొండి చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఒకవేళ సినిమా రిలీజ్ అవ్వకపోతే నేను నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిందే అంటూ స్టేజి పైన చెప్పుకు రావడం సంచలనంగా మారింది. దీంతో కామెడీ రోల్స్ చేసే ఈ యోగి బాబు ఇంత కంత్రిగాడా అంటూ జనాలు మండిపడుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news