Moviesఅలా చేస్తేనే పిల్లలు చెడిపోతారు..తండ్రి పెంపకం పై చిరు కూతురు షాకింగ్...

అలా చేస్తేనే పిల్లలు చెడిపోతారు..తండ్రి పెంపకం పై చిరు కూతురు షాకింగ్ కామెంట్స్.. !!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రోలింగ్ అవుతుంది మెగా డాటర్ శ్రీజ . వ్యక్తిగత కారణాల కారణంగా కావచ్చు.. తను పెట్టే పోస్టు ద్వారా కావచ్చు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కొణిదెల శ్రీజ పేరు ట్రోల్ అవుతూనే ఉంది. కాగా ఇప్పటికే ఇద్దరు మొగుళ్లను వదిలేసిన మెగా డాటర్ అంటూ సోషల్ మీడియాలో రకరకాల హెడ్ లైన్స్ తో ఆమె పరువు తీసేస్తున్నారు . కాగా ఇలాంటి టైం లోనే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పిల్లల పెంపకం పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రీజ ఈసారి పెట్టిన పోస్ట్ మెగా అభిమానులను సైతం టచ్ చేస్తుంది. కాగా తన పోస్టులో శ్రీజ..” తన పిల్లలు తన మాట విని.. తాను చెప్పిన దారిలోనే వెళ్లాల్సిన అవసరం లేదని ..అలా నేను కోరుకోవట్లేదని ..పిల్లల్ని కంట్రోల్ లో పెట్టే అమ్మగా నేను ఉన్న.. వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే విధంగా వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తానని” చెప్పుకొచ్చింది .

“అంతేకాదు ఏది తప్పో ..ఏది ఒప్పో క్లారిటీగా అర్థం చేసుకునే మనస్తత్వం వాళ్ళకి ఉంటే ..మనం అసలు వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ..చిన్న పాప నవిష్క చాలా అల్లరి పిల్ల అని ..పెద్ద కూతురు నివృతి చాలా సైలెంట్ అని చెప్పిన శ్రీజ ..పిల్లలను గారాభం చేస్తే వాళ్ళు చెడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని ..అందుకారణంగానే పిల్లల్ని గారాభం చేయకూడదని ..ఎక్కడ మద్దుచేయాలో ఎక్కడ బెట్టు చేయాలో తనకి బాగా తెలుసు అని అర్ధం వచ్చేలా మాత్లాడింది.

అంతేకాదు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా గారాభం చేసినప్పటికీ క్రమశిక్షణ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడని.. గారాభం చేస్తూనే పద్ధతిగా పెంచాడని చెప్పుకొచ్చింది . దీంతో ఒకసారి శ్రీజ కామెంట్స్ ను ట్రోల్ చేస్తున్నారు జనాలు . పద్ధతుల గురించి నువ్వే మాట్లాడాలి ..నీ తండ్రి పేరును చెడగొడుతున్నావ్ అంటూ ఆమెపై మండిపడుతున్నారు. అంతేకాదు నీ పిల్లలు నీలా తయారవ్వకుండా ఉంటే చాలు అంటూ మెగా డాటర్ పై ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా సరే శ్రీజ మంచి మాట్లాడిన చెడు మాట్లాడిన ట్రోలింగ్ మాత్రం ఆగట్లేదు. అందుకే ఆడపిల్లలి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అంటుంటారు పెద్దలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news