గత కొద్ది రోజులుగా ఒక్కటే వార్త వైరల్ అవుతుంది. పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్నను పక్కకు తప్పించేసి ఆ ప్లేస్లో సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకున్నారన్న ప్రచారం బయటికి వచ్చింది. అసలు ఇది నిజమా కాదా ? అన్నది పక్కన పెడితే ఈ వార్త మాత్రం తెలుగు సినిమా మీడియా వర్గాల్లో ఆసక్తి రేపిన మాట వాస్తవం. పుష్ప సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయింది. బాలీవుడ్ లో ప్రమోషన్లు చేయకుండానే ఏకంగా రు. 100 కోట్లు కొల్లగొట్టింది.
దీంతో ఇప్పుడు సుకుమార్ పుష్ప 2 సినిమాను ముందుగానే పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాను త్రిబుల్ ఆర్ రేంజ్ లో వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని ఇప్పటినుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే పుష్ప సినిమాను ఏకంగా రు. 4-5 కోట్లు ఖర్చుపెట్టి భారీ ఎత్తున ప్రమోషన్లు చేసి రష్యా భాషలోకి డబ్బింగ్ చేసి మరి రిలీజ్ చేశారు. అయితే పుష్ప సినిమా రష్యాలో అట్టర్ ప్లాప్ అయింది. పెట్టిన పెట్టుబడి మొత్తం మటాష్ అయింది.
ఇక ఇక గత కొద్దిరోజులుగా పుష్ప హీరోయిన్ రష్మిక మందన్నకు కన్నడ సినిమా వాళ్లకు ఏవేవో గొడవలు జరుగుతున్నాయి. ఏదేమైనా రష్మిక కన్నడ సినిమా ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తుందని.. కన్నడ సినిమాలలో నటించేందుకు ఆమె ఇష్టపడటం లేదని.. ఆమె దృష్టి అంతా తెలుగు – తమిళం – బాలీవుడ్ మీద ఉందని కన్నడ సినీ జనాలు ఆమె మీద గుర్రుగా ఉన్నారు. అలాగే కన్నడ సినీ ప్రేక్షకులు సైతం రష్మిక తీరు పట్ల ఆమె యాటిట్యూడ్ పట్ల ఆగ్రహంతో ఉన్నమాట వాస్తవం.
అయితే పుష్ప 2కు కన్నడ మార్కెట్ ఇంపార్టెంట్. ఆమెను సినిమాలో పెట్టుకుంటే కన్నడ డిస్ట్రిబ్యూటర్లు, అక్కడ సినిమా జనాలు ఆ సినిమాను రిలీజ్ చేయరని.. అందుకే సుకుమార్ ఆమె ప్లేస్‌లో సాయిపల్లవిని తీసుకున్నారంటూ ఒక్కటే ప్రచారం నడిచింది. అయితే ఇదంతా అవాస్తవం. సాయిపల్లవి రష్మిక కన్నా ఎంత గొప్ప నటి అయినా.. ఆమె రష్మికలా ఎక్స్‌పోజింగ్ చేయదు.. అందుకే సాయిపల్లవిని తీసుకోలేదు.
అయితే పుష్ప సినిమాలో సాయిపల్లవే హీరోయిన్‌గా అనుకున్నారు. అందులో ఉన్న కొన్ని వెగటు సీన్లలో నటించేందుకు సాయిపల్లవి నిర్దాక్షిణ్యంగా నో చెప్పేసింది. అందుకే ఇప్పుడు పుష్ప 2కు మాత్రం రష్మికను తప్పించేసి సాయిపల్లవిని సుక్కు ఎందుకు తీసుకుంటాడు.