పూజా హెగ్డేని నైస్‌గా సినిమాల నుంచి తప్పిస్తున్నది అందుకేనా..? అని కొత్తగా సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. పూజా హెగ్డే అంటే ఇటీవల కాలంలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్గా అంతటా హాట్ టాపిక్ అయింది. ఒక్కసారిగా వరుస పాన్ ఇండియా సినిమాలను చేసి భారీ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరుకుంది. కెరీర్ ప్రారంభంలో పూజాకి అన్నీ చేదు అనుభవాలే. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో మాస్క్ సినిమా చేస్తే అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఆ తర్వాత తెలుగులో చేసిన రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. హిందీలో చేసిన డెబ్యూ మూవీ భారీ డిజాస్టర్. అలాంటి సమయంలో మళ్ళీ సౌత్ నుంచి డోర్స్ ఓపెన్ కావడం అంటే ఎక్కడో అదృష్ఠం ఉన్నట్టే. అది కూడా టాలీవుడ్ అంటే ఇంకో రేంజ్ అని చెప్పాలి. దర్శకుడు హరీష్ శంకర్.. నిర్మాత దిల్ రాజు.. హీరో అల్లు అర్జున్. ఇలాంటి ఛాన్స్ వరుసగా కెరీర్ ప్రారంభంలోనే వచ్చిన హీరోయిన్‌కి వస్తుందా.. ఏ హీరోయిన్ దీనిని ఊహించరు. లక్కీగా పూజా హెగ్డే ఆ గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.
ఈ సినిమా మరీ అంత భారీ కమర్షియల్ సక్సెస్ కాకపోయినాకూడా పూజాకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా బికినీ షో బాగా అట్రాక్ట్ చేసింది. అక్కడ్నుంచీ పూజా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే, పాన్ ఇండియా హీరోయిన్ అనే క్రేజ్ తెచ్చుకున్న పూజాకి మళ్ళీ వరుసగా ఫ్లాపులొచ్చాయి. దానికితోడు అమ్మడు రెమ్యునరేషన్ కూడా కళ్ళు తిరిగేలా డిమాండ్ చేస్తుంది.
ప్రతీదానికి నిర్మాత నుంచే బాదుడు మొదలుపెడుతుందట. అక్కడితో ఆగకుండా రీసెంట్గా ఆచార్య – రాధేశ్యామ్ – విజయ్‌తో బీస్ట్ సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యి అమ్మడి క్రేజ్ ను తగ్గించేశాయి. దాంతో ఇప్పుడు హీరోయిన్గా పూజా హెగ్డేని తీసుకోవాలంటే మేకర్స్ బాగా ఆలోచిస్తున్నారట. మహేష్ – త్రివిక్రమ్ సినిమా మినహా ఆమె చేతిలో పెద్ద సినిమాలు లేవు. మరి రానున్నరోజుల్లో పూజా హెగ్డే కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.