Moviesబ్రేకింగ్‌: మంచు మ‌నోజ్ - భూమా మౌనిక పెళ్లికి బాల‌య్య స‌పోర్ట్...

బ్రేకింగ్‌: మంచు మ‌నోజ్ – భూమా మౌనిక పెళ్లికి బాల‌య్య స‌పోర్ట్ ?

ఎస్ ఇప్పుడు ఇదే టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లోనూ, అటు ఏపీ రాజ‌కీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. మంచు వారి రెండో అబ్బాయి మ‌నోజ్‌, దివంగ‌త నేత‌లు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంప‌తుల రెండో కుమార్తె మౌనిక రెడ్డి రెండో పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్‌. వ‌చ్చే యేడాది ఫిబ్ర‌వ‌రిలో వీరు పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ పెళ్లి అటు మంచు ఫ్యామిలీలోనూ, ఇటు భూమా ఫ్యామిలీలోనూ ఇష్టం లేద‌నే అంటున్నారు.

వీరిద్ద‌రు యేడాది కాలంగా చెన్నైలో స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. మ‌నోజ్ కూడా మంచు ఫ్యామిలీకి దూరంగానే ఉంటున్నాడు. అటు మౌనిక – మ‌నోజ్ క‌లిసి రీసెంట్‌గా త‌ల్లిదండ్రుల‌కు నివాళులు అర్పించేందుకు భూమా ఘాట్‌కు వ‌స్తే.. వాళ్ల ఫేస్ చూసేందుకు కూడా మౌనిక అక్క అఖిల‌కు ఇష్టం లేక‌పోవ‌డంతో వాళ్లు అక్క‌డ నుంచి వెళ్లేవ‌ర‌కు అఖిల అక్క‌డ‌కు రాలేదు.

అయితే ఇప్పుడు అక్క మాజీ మంత్రి అఖిల‌కు పోటీగా చెల్లి మౌనిక కూడా ఆళ్ల‌గ‌డ్డ‌లో స‌రికొత్త రాజ‌కీయం స్టార్ట్ చేయ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. అఖిల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ వ‌స్తుందా ? రాదా ? అన్న డౌట్లు ఉన్నాయి. ఇటు మౌనిక బ‌ల‌మైన మంచు ఫ్యామిలీ కోడ‌లు అయితే.. అటు బాల‌య్య ద్వారా న‌రుక్కు వ‌చ్చి ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాల్లో పాతుకుపోయే ప్లాన్ వేస్తున్న‌ట్టు టాక్ ?

బాల‌య్య మంచు ఫ్యామిలీతో చాలా క్లోజ్‌గా ఉంటాడు. ఇటు మ‌నోజ్ అన్నా కూడా చాలా ఇష్టం. మ‌నోజ్ సినిమాలో కూడా బాల‌య్య స్పెష‌ల్ రోల్ చేశాడు. ఇలా మ‌నోజ్ – మౌనిక దంప‌తులు అయితే ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాల్లో అఖిల‌కు చెక్ పెట్టేందుకు చాప‌కింద నీరులా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వీరి రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు మాత్ర‌మే కాకుండా.. వీరి పెళ్లి కూడా బాల‌య్య సాయం కోరుతున్న‌ట్టు తెలిసింది.

ఫిబ్ర‌వ‌రిలో పెళ్లియ‌న వెంట‌నే బాల‌య్య ఆశీస్సులు తీసుకుని మ‌నోజ్ స‌పోర్ట్‌తో మౌనిక ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక అక్క మీద ఉన్న వ్య‌తిరేక‌త‌ను క్యాష్ చేసుకునేందుకు మౌనిక ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ నేత‌ల‌తో ఇప్ప‌టి నుంచే చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతోంద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news