తెలుగు సినిమా చరిత్రలో నందమూరి కుటుంబానికి ఎంత చరిత్ర ఉందో తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ నుంచి దివంగత ఎన్టీఆర్ వేసిన బీజంతో ఈరోజు ఆ ఫ్యామిలీలో మూడో తరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదగడం మాత్రమే కాదు.. దర్శకుడు, నిర్మాత కూడా. ఆయన ఫ్యామిలీలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 బ్యానర్లు ఉన్నాయి. ఆ బ్యానర్లు ఎవరెవరు స్థాపించారు ? ఆ విశేషాలేంటో చూద్దాం.
1- ఎన్ ఏ టీ ( నేషనల్ ఆర్ట్స్ ) :
ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు నిర్మాణ పర్యవేక్షణలో ఎన్టీఆర్ ఎన్ ఏ టీ ఆర్ట్స్ స్థాపించి ఎన్టీఆర్ హీరోగా ఎన్నో సినిమాలు నిర్మించారు. ఈ బ్యానర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అప్పట్లో ఈ బ్యానర్‌కు మంచి పేరు ఉండేది.
2- రామకృష్ణ సినీ స్టూడియోస్ :
ఎన్ ఏ టీ తర్వాత ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ చనిపోవడంతో అతడి గుర్తుగా రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మించి.. బ్యానర్ కూడా ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించారు. బాలయ్య హీరోగా కూడా ఇదే బ్యానర్లో చాలా సినిమాలు వచ్చాయి. నందమూరి మోహనకృష్ణ, జయకృష్ణ ఈ బ్యానర్ వ్యవహారాలు పర్యవేక్షించేవారు.
ఆ తర్వాత ఎన్టీఆర్, ఆయన కుమారుడు రకరకాల పేర్లతో బ్యానర్లు స్థాపించి సినిమాలు నిర్మించారు. అందులో 4 – తారకరామ ఫిల్మ్ యూనిట్, 5- రామకృష్ణ హార్టీకల్చరల్ స్టూడియోస్, 6- శ్రీమతి కంబైన్స్ 7- బసవరామ తారకం ప్రొడక్షన్స్ ( మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా) బ్యానర్లతో రకరకాల సినిమాలు వచ్చాయి.
8 – ఎన్బీకే ఆర్ట్స్ :
ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఎన్బీకే ఆర్ట్స్ అనే బ్యానర్ బాలయ్య స్థాపించి ఒకటి రెండు సినిమాలు తీసినా ప్లాప్ అయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమాలు ఈ బ్యానర్ మీదే తెరకెక్కాయి.
9- ఇక బాలయ్య హీరోగా యువరత్న ఆర్ట్స్ అనే బ్యానర్‌లోనూ సినిమాలు వచ్చాయి.
10 – ఎన్టీఆర్ ఆర్ట్స్ :
నందమూరి వంశలో మూడో తరం హీరో, ఎన్టీఆర్ మనవడు నందమూరి కళ్యాణ్‌రామ్ తాతపేరుతోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో సినిమాలు నిర్మిస్తున్నారు. తాను హీరోగా తెరకెక్కే సినిమాల్లో ఎక్కువ సినిమాలు ఈ బ్యానర్లోనే వస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ, రవితేజతో కిక్ 2 సినిమాలు కూడా ఇదే బ్యానర్లో వస్తున్నాయి.
11 – బసవతారకరామా బ్యానర్ :
ఇక రీసెంట్గా ఈ యేడాదిలోనే ఎన్టీఆర్ మరో తనయుడు నందమూరి జయకృష్ణ బసవతారకరామా బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు తీస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. అలా ఎన్టీఆర్ కుటుంబంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 బ్యానర్లు ఉన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.