Moviesఇదేం షాక్‌: మ‌హేష్‌కు న‌చ్చ‌ని సినిమా న‌మ్ర‌త‌కు ఫేవ‌రెట్ మూవీయా...!

ఇదేం షాక్‌: మ‌హేష్‌కు న‌చ్చ‌ని సినిమా న‌మ్ర‌త‌కు ఫేవ‌రెట్ మూవీయా…!

ఎస్ ఇది నిజంగానే ఇంట్ర‌స్టింగ్ అనుకోవాలి. మ‌హేష్‌బాబు న‌టించి డిజాస్ట‌ర్‌గా మారి.. మ‌హేష్‌కే న‌చ్చ‌ని ఓ మూవీ ఆయ‌న భార్య న‌మ్ర‌త‌కు పిచ్చ ఇష్టం అట‌. 27 ఏళ్ల మ‌హేష్‌బాబు కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్లు ఉన్నాయి. యావ‌రేజ్‌, డిజాస్ట‌ర్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే మ‌హేష్ న‌టించిన చివ‌రి నాలుగు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. భ‌ర‌త్ అనే నేను సినిమా నుంచి మ‌హేష్ ప‌ట్టిందల్లా బంగారం అవుతోంది.

ఇక మ‌హేష్‌ను పెళ్లాడాక న‌మ్ర‌త మ‌నోడి లైఫ్ స్టైల్‌, కెరీర్‌ను చాలా వ‌ర‌కు మార్చేసింది. ఇక మ‌హేష్ – న‌మ్ర‌త మ‌ధ్య ప్రేమ చిగురించేలా చేసిన సినిమా వంశీ. ప‌ద్మాల‌య స్టూడియోస్ బ్యాన‌ర్‌పై కృష్ణ స్వ‌యంగా నిర్మించిన ఈ సినిమాలో న‌మ్ర‌త హీరోయిన్‌. 2000 అక్టోబ‌ర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆస్ట్రేలియాలో జ‌రిగిన‌ప్పుడే మ‌హేష్ – న‌మ్ర‌త మ‌ధ్య ప్రేమ చిగురించింది.

నాలుగేళ్ల‌కు పైగా ప్రేమించుకున్నాక 2005లో వీరు ముంబైలో పెళ్లి చేసుకున్నారు. ఇక మ‌హేష్ కెరీర్‌లో మ‌నోడికి బాగా డిస్ట‌ర్బ్ చేసి ప‌రువు తీసేసిన సినిమాలు బాబి, బ్ర‌హ్మోత్స‌వం అంటారు. కానీ మ‌హేష్‌కు మాత్రం వ్య‌క్తిగ‌తంగా డిస్ట‌ర్బ్ చేసిన సినిమా వంశీ. త‌న నాన్న కృష్ణ‌తో క‌లిసి న‌టించ‌డం, త‌న సొంత బ్యాన‌ర్‌, త‌న భార్య న‌మ్ర‌త‌తో ప్రేమ చిగురించిన సినిమా వంశీ ప్లాప్ మ‌హేష్‌ను ఎంతో బాధించింద‌ట‌.

క‌థ రెడీ కాకుండా హ‌డావిడిగా సినిమా తీసేశారు. ద‌ర్శ‌కుడు గోపాల్ అదే టైంలో బాల‌య్య‌తో న‌ర‌సింహానాయుడు చేస్తూ ఆ సినిమాపై ఎక్కువ ఫోక‌స్ చేయ‌డం కంటే వంశీ ప్లాప్ అవ్వ‌డానికి కార‌ణ‌మ‌ని టాక్ ఉంది. సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు కూడా మ‌హేష్‌కు సినిమా తేడా కొడుతుంద‌ని అర్థ‌మైపోయింద‌ట‌. రిలీజ్ అయ్యాక మ‌హేష్ జోస్యం నిజ‌మై సినిమా ప్లాప్ అయ్యింది.

క‌నీసం ఆర్టిస్టుగా కూడా మ‌హేష్‌కు ఏ మాత్రం సంతృప్తి క‌లిగించ‌ని సినిమాగా వంశీ రికార్డుల‌కు ఎక్కింది. అయితే ఈ ప్లాప్ సినిమాయే న‌మ్ర‌త‌కు బాగా ఇష్టం అట‌. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్నంత సేపు న‌మ్ర‌త ఎంజాయ్ చేస్తూ సినిమా చేయ‌డం.. అదే టైంలో మ‌హేష్‌తో తొలి చూపులు చిగురించ‌డంతో ఆ మెమ‌ర‌బుల్ మూమెంట్స్ ఆమెకు బాగా గుర్తుండిపోయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news