బాలయ్య ఇప్పుడు పట్టిందల్లా బంగారం అవుతోంది. అఖండ సినిమాతో వెండితెరను షేక్ చేసి పడేసిన బాలయ్య ఇప్పుడు సంక్రాంతికి వీరసింహారెడ్డిగా గర్జించేందుకు వస్తున్నాడు. ఇటు గతేడాది అన్‌స్టాపబుల్ సీజన్ 1తో బుల్లితెరపై సందడి చేస్తూ జై బాలయ్యా అనిపించుకున్నాడు. ఈ యేడాది అన్‌స్టాపబుల్ సీజన్ 2 కూడా హోరెత్తిపోతోంది. ఇప్పుడు అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై బాలయ్య మానియా ఓ రేంజ్లో ఉందనే చెప్పాలి.
వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య తన 108వ ప్రాజెక్టును అనిల్ రావిపూడితో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య నిర్మాత చెరుకూరి సుధాకర్‌కు ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరు ? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. యంగ్, టాలెంటెడ్, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసే దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తోంది. చెరుకూరి సుధాకర్ దగ్గర ప్రశాంత్ వర్మ ఎప్పుడో కోటి రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాడట.
నిర్మాత ఏమో బాలయ్య – బోయపాటి లేదా బాలయ్య – ప్రశాంత్ వర్మ కాంబినేషన్ సెట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ కోసం చాలా మంది పెద్ద నిర్మాతలే లైన్లో ఉన్నారు. అయిఏ ఇప్పుడు బాలయ్య – ప్రశాంత్ వర్మ కాంబినేషన్ సెట్ చేసేందుకు సుధాకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ కుదిరే పనేనా ? అన్న డౌట్ కూడా ఉంది.
బాలయ్య ఊరమాస్ హీరో, ప్రశాంత్ వర్మ కొత్త ఐడియాలు, డిఫరెంట్ కాన్సెఫ్టులతో సినిమాలు తీస్తూ ఉంటాడు. వీళ్లిద్దరి మనస్తత్వాలతో సినిమా ఎంత వరకు సెట్ అవుతుందో ? ఇక ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా కంప్లీట్ అయ్యాక కాని బాలయ్య – ప్రశాంత్ వర్మ గురించి ఆలోచించవచ్చు. మధ్యలో బోయపాటి ప్రాజెక్టు కూడా ఉంది.