బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్, తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాలతో రాజమౌళి రేంజ్ ఇండియాను దాటేసి వరల్డ్ స్థాయికి చేరిపోయింది. రాజమౌళికి సరైన కథ కుదిరి, బడ్జెట్ ఉంటే ప్రపంచమే మెచ్చేంత గొప్ప సినిమా తీస్తాడు అనడంలో సందేహమే లేదు. ఇప్పుడు రాజమౌళి సినిమాలకు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ లెవల్లో క్రేజ్ ఉంది.
అసలు త్రిబుల్ ఆర్ సినిమా ఇండియాలో రిలీజ్ అయిన 9 నెలలకు రీసెంట్గా జపాన్లో రిలీజ్ చేస్తే రు. 20 కోట్ల వసూళ్లతో ఇంకా దూసుకుపోతోంది. జపాన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నెంబర్ వన్ ఇండియన్ సినిమాగా త్రిబుల్ రికార్డుల్లోకి ఎక్కేసింది. చైనాతో పాటు ఆఫ్రికా, యూరప్, ఓవర్సీస్‌లోనూ త్రిబుల్ సంచలనాలు క్రియేట్ చేసింది.
ఇక త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి, ప్రిన్స్ మహేష్‌బాబుతో తెరకెక్కిస్తోన్న సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే అదిరిపోయే బజ్ స్టార్ట్ అవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే ఇండియా వైజ్‌గా సెన్షేషనల్ హైప్ వచ్చేసింది. సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా ? అని ఒక్కటే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అదిరిపోయే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా నుంచి అందరి ఫ్యీజులు ఎగిరే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ బిగ్గెస్ట్ అడ్వెంచర్ డ్రామాను ఫ్రాంచైజ్‌లా…. అంటే కొన్ని బాగాలుగా తీయాలని చూస్తున్నారట. అంటే బాహుబలిలా 1,2 పార్టులుగా కాకుండా… అవసరాన్ని బట్టి మూడో పార్ట్ కూడా తీసే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. రచయితలు అనుకున్న కాన్సెఫ్ట్ అంతా తెరమీద చూపించాలంటే ఒక్క పార్ట్ సరిపోదని.. అందుకే 3 పార్టులుగా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.
అదే నిజం అయితే ఈ అడ్వెంచర్ డ్రామా నెక్ట్స్ లెవల్లో ఉంటుందనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఉంటుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై డాక్టర్ కేఎల్. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రు. 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది.