Moviesకావాలంటే సినిమాలు ఆపేస్తా..చచ్చినా ఆ పని మాత్రం చేయను..!!

కావాలంటే సినిమాలు ఆపేస్తా..చచ్చినా ఆ పని మాత్రం చేయను..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంటర్ అవ్వాలంటే కచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయి . మనం ఎన్ని రూల్స్ పెట్టుకున్నా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక వాటిల్ని కొన్ని పరిస్థితుల్లో చెరిపేయాల్సి వస్తుంది . అలా చెరిపేసిన తర్వాతే స్టార్ హీరోయిన్ అయిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . కాగా అదే పొజిషన్ మీకు వస్తే చేస్తారా..? అంటే నో అని అంటుంది కీర్తి సురేష్. అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు . తెలుగు ఇంటి అమ్మాయిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ..ఇప్పటివరకు చేసిన సినిమాలలో వల్గారిటీకి దూరంగా నటనకు దగ్గరగా జనాలను ఆకర్షించింది .

కాగా రీసెంట్గా రిలీజ్ అయిన సర్కారి వారి పాట సినిమాలో ఆమె నటించిన తీరు జనాలను ఆశ్చర్య పరిచింది. ఫస్ట్ టైం తన హద్దులను చెరిపేస్తూ మాస్ యాంగిల్ టచ్ ఇవ్వడం జనాలకు కొత్తగా అనిపించింది . అయితే కీర్తి సురేష్ అలా నటించడం కొంతమందికి నచ్చినా.. మరి కొంతమందికి నచ్చలేదు . ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ను కొంతమంది ట్రోల్ చేశారు . అయినా కానీ కీర్తి సురేష్ తగ్గేదే అన్న రీతిలో హాట్ ఫోటోషూట్స్ కూడా చేసింది.

కాగా రీసెంట్ గా కోలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ..”మీకు క్యాస్టింగ్ ఎదురు అయిందా..? ఒకవేళ కమిట్మెంట్ ఇస్తేనే మీరు హీరోయిన్ అవుతారు అంటే మీ సమాధానం ఏమిటి..?” అన్న ప్రశ్నకు ..” క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఉంది అని నాకు తెలుసు. నాతో కొంతమంది నటీనటులు చెప్పుకొచ్చారు . అయితే నా వరకు అది ఎదురు కాలేదు. మనం బిహేవ్ చేసే పద్ధతిని బట్టి అన్ని ఉంటాయి. ఒకవేళ నిజంగా నాకు క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితి ఎదురై ఉంటే మాత్రం చచ్చినా.. నేను సినిమాలు చేసేదాన్ని కాదు . సినిమాలు ఆపేసుకుని వేరే వేరే జాబ్ చూసుకునేదాని..అంతేకానీ నా కమిట్మెంట్స్ కోసం నేను కమిట్మెంట్ ఇచ్చి ఇతరులను కమిట్ చేయను” అంటూ ఘాటుగా స్పందించినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే కీర్తి సురేష్ హద్దులు చేరిపిన ఇంకా హద్దుల్లోనే ఉంది అంటున్నారు ఫాన్స్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news