విశ్వనటుడు, లోక నాయకుడుగా అసాధారణమైన క్రేజ్..పాపులారిటీని సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్. ఆయన చేసినన్ని పాత్రలు ఇప్పటివరకు మరొక హీరో చేయలేదనే చెప్పొచ్చు. హీరోగా ఎన్ని విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించారో నిర్మాతగానూ విభిన్న కథా చిత్రాలను నిర్మించి సక్సెస్‌లు అందుకున్నారు.
అగ్రదర్శకులు బాలచందర్, కె విశ్వనాథ్ దగ్గర్నుంచీ నేటి టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వరకూ ఎందరితోనూ పనిచేశారు. సొంత దర్శకత్వంలో విశ్వరూపం, దశావతారం లాంటి అద్భుతమైన సినిమాలను రూపొందించారు. కమల్ హాసన్ కెరీర్లో మైల్ స్టోన్‌లా నిలిచిన చిత్రాలెన్నో ఉన్నాయి. అప్పట్లో స్వాతిముత్యం, సాగర సంగమం లాంటి గొప్ప క్లాసిక్స్ ఉన్నాయి.
పదేళ్ల తర్వాత రీసెంట్గా వచ్చిన విక్రమ్ సినిమాతో కమల్ తన స్టామినా ఏంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. వయస్సు మీద పడినా కూడా కమల్ క్రేజ్, స్టామినా ఏ మాత్రం తగ్గలేదని విక్రమ్ నిరూపించింది. ఏకంగా రు. 400 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. భారతీయుడు లాంటి సామాజిక అంశంతో కూడుకున్న బ్లాక్ బస్టర్స్ కమల్ హాసన్ ఖాతాలో ఉన్నాయి. ఇలాంటి అసాధారణమైన క్రేజ్ సాధించికున్న కమల్ ఒక్క విషయంలో మాత్రం ఎన్నో ట్రోల్స్ ఎదుర్కున్నారు.
కమల్ స్త్రీ లోలుడు అన్న విమర్శలు ఆయనపై తీవ్రంగా ఉన్నాయి. కమల్ వైవాహిక జీవితంలో రెండు, మూడు పెళ్లిళ్లు విడాకులు ఇవన్నీ ఆయనపై మహిళా అభిమానుల్లో మైనస్‌గా మారాయి. అదే ఆయన కెరీర్లో పెద్ద బ్యాడ్ అయ్యింది. అదే హీరోయిన్స్‌తో ఉండే లిప్ లాక్ సన్నివేశాలు. కమల్ సినిమా అంటే ఒక దశ తర్వాత హీరోయిన్‌తో ఖచ్చితంగా లిప్ కిస్ ఉంటుందని ఫికైపోయారు. కమలే స్వయంగంగా హీరోయిన్లతో లిప్‌కిస్‌లు కావాలని కండీషన్లు పెడతాడట.
కమల్ సినిమా కాబట్టి ఆయనతో పెదవి ముద్దు సన్నివేశాలు ఉంటాయని తెలిసి కూడా ఒప్పుకున్న స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. ఆయనతో సినిమా చేసిన హీరోయిన్స్ దాదాపు పెదవి కలిపిన వారే. మనీషా కోయిరాల, రేవతి, గౌతమి, పూజా కుమార్ ఇలా చాలామంది కమల్‌తో ముద్దుల వర్షం కురిపించినవారే. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ అనుకున్నారు గానీ, హీరోయిన్స్‌ను ముద్దాడిన హీరో కమల్ అని ముందు ఉన్నది కమల్ అని చాలామందికి నోటీస్ కాకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.