అయ్యో అయ్యో అయ్యయ్యో అనుకున్నది ఒక్కటి అయినది మరొకటి .ఇది పాట కాదండి ప్రస్తుతం తమన్న ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన గుర్తుందా శీతాకాలం సినిమా జనాలకు అసలు గుర్తు లేకుండా పోయింది . అసలు సినిమా ఎందుకు తీశారో.. డైరెక్టర్ కైనా తెలుసా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు . తమన్నా అందాలు ప్లస్ గా మారిన.. సత్యదేవ్ నటన సూపర్ గా ఉన్నా ..కథలో కంటెంట్ లేకపోవడంతో సినిమా డిజాస్టర్ గా మారింది. కాగా అంతకుముందు నటించిన బబ్లీ బౌన్సర్ కూడా అట్టర్ ప్లాప్ అయింది .
ఈ క్రమంలోనే తమన్నా ఇక తనకి హిట్లు పడవని డిసైడ్ అయిపోయి .. ఈ క్రమంలోనే తమన్న సరికొత్త కంటెంట్లకు తెరలేపాలి అని చెప్పి డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకుంటుందట . ఈ క్రమంలోనే బాలీవుడ్ లో క్రేజీ సినిమాకి సైన్ చేసినట్టు తెలుస్తుంది . అంతేకాదు ఇది టోటల్గా రియల్ ఇన్సిడెంట్ కి సంబంధించిన సినిమాగా తెలుస్తుంది. ఇలాంటి సినిమాలు అయితే జనాలకు బాగా ఆదరిస్తారని తద్వారా తన పేరు మళ్లీ ఫామ్ లోకి వస్తుందని తమన్నా ఆశ పడుతుందట.
అంతేకాదు ఈ సినిమాలో తమన్నా బ్రోతల్ హౌస్ నడిపే ఉమన్ గా మనకు కనిపించబోతుందట . డబ్బు కోసం ఆడవాళ్లను ఎలా శారీరకంగా హింసిస్తారు ..అన్నది అసలు పాయింట్ . అంతేకాదు ప్రస్తుతం సమాజంలో వ్యభిచారం ఎంత కామన్ గా మారిపోయిందో అందరికీ తెలిసిందే. అలా వ్యభిచారం చేసే ఆడవాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి పనులు చేయడానికి సిద్ధపడ్డారు అంటూ తెలిసేలా జనాలకు ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాని ఇవ్వాలని తమన్న ఇలాంటి సినిమాకు ఒప్పుకునిందట.
అంతేకాదు గతంలో అలియా భట్ సైతం గంగుభాయ్ కతీయవాడి అనే సినిమాలో నటించి పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుంది. ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న తమన్నా ఇప్పుడు ఆమెలాంటి పాత్రలో నటించడానికి సిద్ధపడిందంటూ బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే తమన్న వేసిన డేరింగ్ స్టెప్ బావుంది అంటున్నారు ఫాన్స్ . చూడాలి మరి ఈ సినిమా అయినా తమన్నా కి కొత్త లైఫ్ ఇస్తుందో లేదో..?