కోట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన న్యూస్ నిన్న అఫీషియల్ గా ప్రకటించాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఒక్కగాని ఒక్క కొడుకు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అంటూ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . మనకు తెలిసిందే మెగాస్టార్ కొడుకుగా రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు . ఆ తర్వాత అయినా స్టైల్ లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన రామ్ చరణ్ ప్రజెంట్ భారీ బిగ్ ప్రాజెక్ట్స్ లో భాగమై ఉన్నాడు.
కాగా లైఫ్ ఎటువంటి టెన్షన్స్ లేకుండా ముందుకు వెళుతున్నా కానీ ఆయనకి ఎక్కడో పిల్లలు లేరన్న బాధ ఎక్కువగా ఉండింది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో పలువురు ఆయనను ఓకే విధంగా ట్రోల్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే మెగా వారసుడు న్యూస్ సోషల్ మీడియాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే వచ్చింది . కాగా పెళ్లయిన పదేళ్ల తర్వాత మెగా కోడలు ఉపాసన గర్భం దాల్చింది అన్న న్యూస్ ని అఫీషియల్ గా మెగాస్టార్ చిరంజీవిని షేర్ చేసేసరికి మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఉపాసన కి మూడు నెలలు కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఆమె బాడీ ఫిట్‌గా ఉన్నప్పటికీ హెల్తీగా ఉన్నప్పటికీ ఉపాసన గర్భసంచి వీక్ గా ఉందని ..ఇదే క్రమంలో బేబీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ సలహాలు ఇచ్చారట. ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన హెల్త్ విషయంలో చాలా కేరింగ్ గా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు పెళ్లయిన పదేళ్లకి ఉపాసన ప్రెగ్నెంట్ అయిన సందర్భంగా అందరూ సంతోషపడుతున్నారు కానీ చిరంజీవి అమ్మగారు అంజనమ్మ మాత్రం హ్యాపీ గా ఎంజాయ్ చేయలేకపోతున్నారట .
ఉపాసన ప్రెగ్నెన్సీ పూర్తయి చేతిలో బిడ్డ పడే వరకు ఆమెకు టెన్షన్ గానే ఉంటుందట. ఈ క్రమంలోనే కోడలు సురేఖ కూడా అత్తగారికి ధైర్యం చెప్పి “నా కోడలికి ఏం కాదు హెల్తీగా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చిందట . ఏది ఏమైనా సరే పెళ్లయిన ఇన్ని ఏళ్లకి కి ఉపాసన ప్రెగ్నెంట్ అయిందని ఆనందపడాలో ..లేక ఉపాసన ప్రెగ్నెన్సీలో ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయని బాధపడాలో అర్థం కాకుండా సతమతమవుతున్నారు మెగా ఫాన్స్ . ఉపాసన హ్యాపీగా ప్రెగ్నెన్సీ ఎంజాయ్ చేసి .. పండు లాంటి బాబుకు జన్మని ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.