సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అందరూ కలిసి మెలిసి సినిమాలు చేసుకుంటూ ప్రతి ఈవెంట్లో సరదాగా నవ్వుకుంటూ సినిమాను ఒకరివి ఒకరు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు . అయితే మధ్యలో ఈ ఫ్యాన్స్ కి ఏమొచ్చిందో తెలియదు కానీ కొందరు స్టార్ హీరోస్ ఫ్యాన్స్ మాత్రం కావాలని తమ హీరోలను మరో హీరో ఫ్యాన్స్ చులకనగా చూస్తున్నారని లేదా పలు రకాల కారణాలతో వారిని ట్రోల్ చేస్తూ ఉంటారు . కాగా ప్రజెంట్ ఇప్పుడు అదే కేటగిరీలోకి ఎంటర్ అయిపోయాడు టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ .
చాలా సైలెంట్ గా క్యూట్ గా తన పని తాను చేసుకుపోయే రామ్ పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ట్రోల్ అవుతుంది. దానికి రీజన్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా స్టార్ట్ చేసినఉస్తాద్ భగత్ సింగ్ సినిమానే కారణం .ఎస్ అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు అనౌన్స్ చేసిన ఈ సినిమా నిన్న మైత్రి మూవీ ఆఫీసులో గ్రాండ్ గా లాంచ్ అయింది. అయితే భవధీయుడు భగత్ సింగ్ అంటూ జనాలకు పరిచయం చేసిన హరీష్ శంకర్. ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ పేరును మార్చారు ,
దాని వెనుక ఉన్న రీజన్ తెలియదు కానీ ప్రెసెంట్ ఉస్తాద్ అనే పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నిజానికి ఈ పేరు ఆల్రెడీ రాం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ ట్యాగ్ టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ది అంటూ కొందరు జనాలు కామెంట్ చేస్తున్నారు. రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో వస్తాద్ కొనసాగించారు . అయితే రామ్ అభిమానులు ఇప్పుడు పవన్ తీరు పై మండిపడుతున్నారు .
కాగా అదే రేంజ్ లో పవన్ అభిమానులు సైతం రాం ని ట్రోల్ చేస్తున్నారు. పవన్ స్థాయికి మీ హీరో రామ్ సరిపోతాడా..? మీరే ఆలోచించుకోండి అంటూ డి గ్రేడ్ చేస్తున్నారు . అంతేకాదు పవన్ కళ్యాణ్ రేంజ్ కి హీరో రామ్ ఎన్ని జన్మలెత్తిన సరిపోడు అంటూ దారుణంగా రామ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇదే క్రమంలో చాలా సైలెంట్ గా ఉండే ఈ టాలీవుడ్ హీరో రామ్ పేరు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ ట్రోల్ అవుతుంది . ఏది ఏమైనా సరే “ఉస్తాద్” అనే పేరు పవన్ ఫాన్స్ మధ్య పెద్ద చిచ్చు పెట్టింది.