వావ్ .. ఇయర్ ఎండింగ్ లో .. తన అభిమానులకు గుడ్ న్యూస్ అందజేసింది నటి పూర్ణ . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . అల్లరి నరేష్ తో సీమటపాకాయ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన బ్యూటీ.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది . అయితే హిట్లు చాలా తక్కువ అందుకున్న ఈ బ్యూటీ..స్టార్ డైరెక్టర్ రవిబాబు డైరెక్షన్ లో ఎక్కువ సినిమాలు చేసి కెరియర్లో అతనితో ఎక్కువగా గాసిప్స్ తెచ్చుకునింది .
అయితే వీటి పై ఎప్పటికప్పుడు ఫేక్ ఫేక్ అంటూ చెప్తూ వచ్చింది . కాగా రీసెంట్ గానే పూర్ణ పెళ్లి చేసుకుంది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పూర్ణ వ్యాపారవేత్త అసిఫ్ అలీతో గ్రాండ్గా పెళ్లి చేసుకుంది . అయితే పెళ్లి విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ గా దాచిన ఈ అమ్మడు ..ఆ తర్వాత దివాళి సందర్భంగా తన పెళ్లిని అఫీషియల్ గా ప్రకటించింది . ఎప్పుడో జూన్ 12 న నాకు పెళ్లి జరిగింది అని కొన్ని కారణాలవల్ల పెళ్లిని అనౌన్స్ చేయలేకపోయాను అని …త్వరలోనే కేరళలో పెద్ద రిసెప్షన్ ఇస్తానని ..అప్పుడు అందరికీ ఇన్విటేషన్స్ అందుతాయని చెప్పుకొచ్చింది .
కాగా న్యూ ఇయర్ సందర్భంగా తన యూట్యూబ్ ఛానల్ లో తాను తల్లి కాబోతున్నట్లు అఫీషియల్ గా స్పందించింది . ఇప్పటికీ మర్చిపోలేను అంటూ తన సబ్స్క్రైబర్లతో తాను ప్రెగ్నెంట్ అంటూ చెప్పుకొచ్చింది . అయితే ఇంత త్వరగా ప్రెగ్నెంట్ అవ్వడం వెనక వేరే రీజన్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీస్ పెళ్లయిన సంవత్సరానికి విడాకులు తీసుకొని దూరం అయిపోతున్నారు . ఈ క్రమంలోని తమ మధ్య అలాంటి బేధాభిప్రాయాలు రాకుండా ఉండాలంటే బిడ్డ ఉంటేనే కరెక్ట్ అంటూ పూర్ణ దంపతులు ఫిక్స్ అయ్యారట. అందుకే ఈ గుడ్ న్యూస్ అందజేసింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు పూర్ణ దంపతులకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.