Moviesప్ర‌మాదంలో నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్‌... ఇదే జ‌రిగితే నాని క‌నుమ‌రుగే...!

ప్ర‌మాదంలో నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్‌… ఇదే జ‌రిగితే నాని క‌నుమ‌రుగే…!

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ డేంజ‌ర్ జోన్‌లో ప‌డిపోతోందా ? నాని ఇక‌పై జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే నాని టాలీవుడ్‌లో అవుట్ డేటెడ్ అవ్వ‌డంతో పాటు నానిని సినీ అభిమానులు మ‌ర్చిపోయేంత ప్ర‌మాదంలోకి వెల్లిపోనున్నాడా ? అంటే అవున‌నే చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో న‌డుస్తున్నాయి. క్లాస్ సినిమాలో నాని ఇప్ప‌టి వ‌ర‌కు బండి లాక్కొచ్చేశాడు. మ‌నింట్లో కుర్రాడు, ఎదురింటి అబ్బాయి అన్న‌ట్టుగా నానిని ప్రేక్ష‌కులు బాగా ఇష్ట‌ప‌డ్డారు.

అయితే రాను రాను నాని న‌ట‌నలో ఓ మొనాట‌నీ వ‌చ్చేసింది. నాని ఎంచుకునే క‌థ‌లు కూడా మ‌రీ క్లాస్‌గా, ఓ వ‌ర్గానికి మాత్ర‌మే క‌నెక్ట్ అవుతున్నాయి. దీంతో మిగిలిన వ‌ర్గాల వారు నాని సినిమాలంటేనే ప‌ట్టించుకోవ‌డం మానేశారు. అందుకే కాస్తో కూస్తో బాగున్నాయ‌ని టాక్ వ‌చ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ అవ్వ‌డం లేదు.

విల‌న్ ట‌చ్ ఉన్న సినిమా చేయాల‌ని వి సినిమా చేస్తే మిస్ ఫైర్ కొట్టేసింది. ఇక కృష్ణార్జున యుద్దం..గ్యాంగ్ లీడర్, టక్ జగదీష్ ఇలా ప్రతి ప్రయత్నం కూడా క‌లిసి రాలేదు. ఇక శ్యామ్ సింగరాయ్ ఒక్కటే ఊరట. అది కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక చివ‌ర‌గా వ‌చ్చిన అంటే సుందరానికి మంచి సినిమాయే. కానీ అది కూడా జ‌నాల‌కు ఎక్క‌లేదు.

ఇక నాని చేసే క‌థ‌ల‌తో ఇప్పుడు చాలా మంది హీరోలు సినిమాలు చేసేస్తున్నారు. అప్‌క‌మింగ్ హీరోలు దూసుకుపోతున్నారు. అడ‌వి శేష్‌కు వ‌రుస‌గా ఒక‌టి కాదు.. రెండు కాదు ఆరు హిట్లు ప‌డ్డాయి. జొన్న‌ల‌గ‌డ్డ సిద్ధు, న‌వీన్‌, విశ్వ‌క్‌సేన్ ఇలా చాలా పెద్ద జాబితానే ఉంది. నాని త‌ర్వాత వ‌చ్చిన‌.. ఇంకా చెప్పాలంటే నాని సినిమాలో చిన్న పాత్ర చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను నానిని ప‌క్క‌న పెట్టి చూడ‌లేనంత ఎత్తుకు విజ‌య్ ఎదిగిపోయాడు.

ఓ వైపు అప్‌క‌మింగ్ హీరోలు దూసుకుపోతున్నారు. నాని ఇక‌పై మ‌రీ క్లాస్ ట‌చ్ ఉన్న క‌థ‌ల‌తో.. అది కూడా క్లాస్‌లో కూడా ఓ వ‌ర్గం వారినే మెప్పించే సినిమాలు చేసుకుంటూ పోతే రేసులో వెన‌క‌ప‌డిపోవ‌డం ఖాయం. అదే జ‌రిగితే అవుట్ డేటెడ్ కూడా అయిపోతాడు. ఇక‌పై అయినా నాని స‌రికొత్త క‌థ‌లు, అన్ని వ‌ర్గాల‌ను మెప్పించే క‌థ‌లు ఎంచుకుంటే మంచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news