టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే . అందానికి అందం నటనకి నటన.. పొగరు కి పొగరు.. అమాయకత్వానికి అమాయకత్వం. అన్ని సమపాలనలో ఉన్న హాట్ బ్యూటీ అని చెప్పాలి . కోపం వస్తే అరుస్తుంది.. ప్రేమ వస్తే దగ్గరికి తీసుకుంటుంది ..అలాంటి ఓ నేచర్ కలిగిన హీరోయిన్ ఇండస్ట్రీలో చాలా రేర్ గా ఉంటారు. అంతేకాదు పెద్దలకి గౌరవం ఇచ్చే హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో చాలా తక్కువ ..అలాంటి వాళ్ళల్లో టాప్ టెన్ పొజిషన్లో ఒకరుగా ఉంటుంది కాజల్ అగర్వాల్ .
కాగా తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలో నటించింది. ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . అయితే తెలుగు – తమిళ్ – హిందీ సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్ కి తెలుగులో బాగా నచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే ఆమెకు ఇండస్ట్రీలో నచ్చని హీరో రామ్ చరణ్ అంటూ ముఖానే చెప్పుకొచ్చింది. గతంలో ఇంటర్వ్యూల మాట్లాడుతూ చరణ్ పై ఆమె సంచలన కామెంట్స్ చేసింది.
“నన్ను సినిమా షూటింగ్ టైంలో చాలా విసిగిస్తాడని.. ఈ కారణంగానే అతడంటే నాకు ఇష్టం లేదని సరదాగా చెప్పుకొచ్చింది. మగధీర సినిమా టైంలో చాలా కూల్ గా ఉన్న చరణ్ సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చేసరికి నన్ను ప్రతి విషయంలో ఏడిపించేవాడని ..ఇక ఆ తర్వాత ఎవడు ..నాయక్ ..గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ టైంలో కూడా నన్ను బాగా విసిగించాడని చెప్పుకు వచ్చింది .అంతేకాదు తన ఫేవరెట్ చాక్లెట్స్ ని కూడా తిననిచ్చేవాడు కాదు అని..దాచి పెట్టేసేవాడని..అలా సరదాగా వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చనువుతూ చరణ్ కంటే నాకు వాళ్ళ నాన్నగారు మెగాస్టార్ అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది”. ఏది ఏమైన సరే తెర పై చరణ్-కాజల్ జంట సూపరో సూపర్ ..మరోసారి జతకడితే బాగుండు.