మన టాలీవుడ్ హీరోలు సినిమాలు తీయడంతో పాటు సినిమాల్లో నిర్మాణ భాగస్వాములుగా ఉంటూ సరికొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించారు. మరి కొందరు హీరోలు ఇతరత్రా వ్యాపారాల్లోనూ ఉంటున్నారు. ఇక స్టార్ హీరోలు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ ఇప్పటికే మల్టీఫ్లెక్స్ బిజనెస్‌ల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. మహేష్‌బాబు ఏసియన్ వాళ్లతో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఎంబీ మాల్‌ను నిర్మించాడు. ఇది ఏసియన్ వాళ్లు, మహేష్ కలిసి నిర్మించిన మాల్ & మల్టీఫ్లెక్స్. ఏడు స్క్రీన్లతో నగరానికే తలమానికంగా చాలా గొప్పగా ఈ మాల్ ఏర్పాటు చేశారు.
ఇప్పుడు హైదరాబాద్‌లోనే నెంబర్ వన్ మాల్‌గా ఏఎంబీ మాల్ ఉంది. ఇక ఏసియన్ వాళ్లతోనే కలిసి తన సొంత ఊరు మహబూబ్‌నగర్లో ఏవీడీ పేరుతో అక్కడో మల్టీఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. అలా ఏసియన్ వాళ్లు టాలీవుడ్ హీరోలందరిని గుప్పెట్లో పెట్టుకునేందుకు వాళ్లతో కలిసి మల్టీఫ్లెక్స్ చైన్‌లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో అల్లు అర్జున్‌తో కలిసి ఏఏ పేరుతో మరో మల్టీఫెక్స్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
అంతకుముందు అమీర్‌పేటలో సత్యం థియేటర్ ఉండేది. ఆ సత్యం థియేటర్ ప్లేసులోనే ఇప్పుడు ఈ కొత్త మల్టీఫ్లెక్స్ నిర్మించారు. ఇప్పటికే ఇది పూర్తయ్యింది. సంక్రాంతికి ఈ మాల్, మల్టీఫ్లెక్స్ ఓపెన్ కానుంది. ఏషియన్ అల్లు అర్జున్ పేరుతో ఇది నిర్మించారు. ఇది ఏసియన్ వాళ్లకు, అల్లు అర్జున్ జాయింట్ ఆస్తిగా ఉంటుంది. త్వరలోనే ఈ మల్టీఫ్లెక్స్ బన్నీ చేతుల మీదుగా ఓపెన్ కానుంది.
అల్లు అర్జున్ ఇమేజ్‌కు, టెస్ట్‌కు తగినట్టుగానే ఈ మల్టీఫ్లెక్స్‌ను నిర్మించారు. అమీర్‌పేట పరిసరాల్లోనే అత్యంత విలాసవంతమైన భవనంగా ఈ మాల్ ఉండనుంది. ఇందుకోసం కోట్లు ఖర్చు చేశారు. ఏఎంబీ మాల్ తరహాలోనే ఇంటీరియల్ డిజైన్ చేశారట. ఇప్పటికే బన్నీ ఫొటోతో ఈ మల్టీఫ్లెక్స్ లోగో కూడా రిలీజ్ చేశారు. ఇందులో మూడు స్క్రీన్లు ఉంటాయని తెలుస్తోంది. మరి బన్నీ మాల్ నగర సినీ ప్రియులతో పాటు ప్రజలను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో ? చూడాలి.