రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ మరి కొద్ది గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా లో ఈ అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు . ఇప్పటికే ఎపిసోడ్ పై భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ ప్రోమో ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమో మిలియన్ వ్యూయ్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది .
కాగా రీసెంట్గా జనాలను మరింత ఊరిస్తూ మరో ప్రోమో ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ క్రమంలోనే బాలయ్య.. ప్రభాస్ మధ్య ఇంట్రెస్టింగ్ చర్చ సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో ఉండే పెద్దలందరూ ఎక్కువగా డిస్కస్ చేసే అంశం ప్రభాస్ పెళ్లి , టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ..పెళ్లి చేసుకుంటే చూడాలన్నది కోట్లాదిమంది ఫ్యాన్స్ కళ . అంతేకాదు ఆయనను అభిమానించే స్టార్స్ కల కూడా. ఇదే విషయాన్ని బాలకృష్ణ ..ప్రభాస్ ని డైరెక్ట్ గా అడిగేసాడు .
“పెళ్లెప్పుడు చేసుకుంటావు ” అంటూ ప్రభాస్ ని స్టేజిపైనే అడగగా ..ఆయన సమాధానం ఇస్తూ “మనకు రాసిపెట్టలేదు అనుకుంటాను సార్ “..అంటూ చెప్పుకొస్తారు. దీంతో బాలకృష్ణ సైతం..” మీ అమ్మకు చెప్పిన డైలాగులు నాకు చెప్పొద్దు “అంటూ కౌంటర్ ఇస్తాడు . దీంతో ప్రభాస్ పెళ్లి పై జరిగిన చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ షోలో తనకు హీరోయిన్ అనుష్కకు మధ్య ఉన్న సంబంధం గురించి కూడా బయటపెట్టినట్లు సమాచారం అందుతుంది . అంతే కాదు ఈ ఎపిసోడ్ ని బాహుబలి సినిమా లాగా రెండు పార్టులుగా విడదీసి స్ట్రీమింగ్ చేస్తున్నారు ఆహా. చూడాలి మరి ఫాన్స్ కు తెలియని ఎన్ని విషయాలు రెబెల్ హీరో బాలయ్యతో పంచుకున్నాడో..?