సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫైర్లు, ఇల్లీగల్ అఫైర్లు చాలా కామన్ . పక్కనే భర్త ఉన్న హీరోతో పబ్లిక్ గా రొమాన్స్ చేసే హీరోయిన్స్ ఉన్న ఈ కాలంలో లవ్ లో పడని హీరో హీరోయిన్స్ ..లిమిట్స్ క్రాస్ చేయని అందాల ముద్దుగుమ్మలు లేరని అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ప్రేమలో పడితేనే తమ పేరుకి పాపులారిటీ వస్తుందని ..హీరోలతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు. పెళ్లి అయిన హీరోలు మాత్రం మాకు అలాంటి తలనొప్పులు వద్దు అంటూ దూరంగా తప్పుకుంటున్నారు.
కాగా ఇలాంటి తరుణంలోనే ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . టాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న నితిన్ కూడా లవ్ ఫెయిల్యూర్ అంటూ వైరల్ గా మారింది. ప్రజెంట్ షాలినితో మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నా నితిన్.. జయం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమయ్యాడు . ఇక తర్వాత నితిన్ కెరీర్ ఎలా ముందుకు సాగిందో మనకు తెలిసిందే . హిట్లు ఫ్లాపులని తేడా లేకుండా వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ.. మంచి హిట్స్ అందుకున్నాడు .
కాగా ఈయన సినిమాలు చేసే టైంలోనే హీరోయిన్ ఇలియానా తో ప్రేమలో పడ్డాడని ఓ న్యూస్ అప్పట్లో హల్చల్ చేసింది. వీళ్ళిద్దరి కాంబోలో రెచ్చిపో అనే సినిమా వచ్చింది . ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . అయితే ఈ సినిమా కథ విన్నప్పుడు నితిన్ కి అస్సలు నచ్చలేదట . కేవలం హీరోయిన్ ఇలియానాతో రొమాన్స్ కోసమే సినిమా చేశాడన్న టాక్ బలంగా వినిపించింది. అంతేకాదు క్యారెక్టర్ నచ్చకపోయినా సరే రెమ్యూనరేషన్ కోసం ఇలియానా సినిమా చేసినట్లు అప్పట్లో టాక్ వైరల్ అయింది.
కాగా ఎప్పటి నుంచో ఇలియానా అంటే క్రష్ ఉన్న నితిన్ కి.. ఆమె మరో హీరోతో ఎఫైర్ లో ఉంది అని తెలియడంతో ఆయన మనసు ముక్కలై.. ఆమెకు తన ప్రేమ విషయాన్ని చెప్పకుండానే సైలెంట్ అయిపోయాడట. అంతేకాదు ఇప్పటికీ ఇలియానా అంటే ఆయనకి ఇష్టం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. అంతేకాదు ఇలియానా-నితిన్ ప్రేమాయణం ..నితిన్ వైఫ్ షాలిని కి తెలుసట. ఏది ఏమైనా సరే పెళ్లయిన హీరో పై ఇలాంటి రూమర్ రావడం చాలా దారుణం . మరి చూడాలి నితిన్ ఈ రూమర్ పై ఎలా స్పందిస్తాడో.. స్పందించి క్లారిటీ ఇస్తే నితిన్ ఫాన్స్ కూడా కూల్ అవుతారు అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు.