నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే . ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్టార్ హీరోలలో బాలయ్య ముందు వరుసలో ఉంటారు . ఒక విషయం నచ్చితే శభాష్ అంటూ భుజం తట్టే ఆ చేతులే ..ఓ చెడు పని చేస్తే చంప చల్లుమనిపిస్తుంది . అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి . పబ్లిక్ లో కోపానికి గురైన బాలయ్య ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి . అయితే అదంతా బాలయ్యలోని ఒక షేడ్ మాత్రమే. మరో షెడ్ ఎంతో ప్రేమగా ఉంటారు.
సహాయం కోరి ఇంటికి వచ్చిన వారికి లేదు , కాదు అనకుండా తనదైన సహాయం చేసి పంపిస్తాడు . కాగా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నా సరే ..బాలయ్య కొంతమంది హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎంతోమంది ముద్దుగుమ్మలతో నటించిన.. తన ఫేవరెట్ హీరోయిన్ గా చెప్పుకునే హోమ్లీ బ్యూటీ స్నేహ తో మాత్రం నటించలేకపోయాడు . నిజానికి బాలయ్యకు పద్ధతిగా చీర కట్టుకొని హోంలీ రోల్స్ చేసే అందాల ముద్దుగుమ్మలు అంటే చాలా ఇష్టమట . అందుకే తన సినిమాలో ఎక్కువగా అలాంటి లేడీస్ కి అవకాశాలు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారట .
అయితే కథలోని కంటెంట్ దృష్ట్యా డైరెక్టర్ ఆప్షన్ వల్ల కొన్నిసార్లు మో డ్రెన్ బేబీలకు ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుందని ..అయితే తాను ఎంతో ఇష్టపడే స్నేహ తో మాత్రం సినిమా చేయలేకపోయానని బాలయ్యబాధపడుతూనే ఉన్నారట. ఇప్పటివరకు బాలయ్య- స్నేహ కాంబోలో సినిమా కుదిరిందే లేదు. డైరెక్టర్ లు సైతం బాలయ్య మాస్ లాంగ్వేజ్ కి స్నేహ హీరోయిన్గా సెట్ అవ్వదుఅంటూ ఆమెను కాకుండా సినిమాలో వేరే బ్యూటీఫుల్ హీరోయిన్స్ ని పెట్టడానికి చూస్తున్నారట. అందుకే ఆమెను బాలయ్య సినిమాలో ఇప్పటివరకు హీరోయిన్గా చూడలేకపోయాం అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి బాలయ్య – స్నేహ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో..?