టాలీవుడ్ లో నటిగా పేరు తెచ్చుకుంది కన్నడ అమ్మాయి ధన్య బాలకృష్ణ. నేను శైలజ – జయ జానకీ నాయక – రాజు గారి గది లాంటి సినిమాలో ఆమెకు మంచి పాత్రలే పడ్డాయి. అయితే ఆమెకు అందంతోపాటు అభినయం ఉన్నా ఆరడుగులకు పైగా పొడవు ఉన్నా కూడా ఎందుకో సరైన అవకాశాలు రాలేదు. టాలీవుడ్ స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే.. కనీసం మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లో కూడా హీరోయిన్గా ధన్య ఛాన్సులు దక్కించుకోలేకపోయింది. అయితే ఇటీవల ఓటిటిలో రిలీజ్ అయిన అల్లుడుగారు – లోసర్ – రెక్కీ వెబ్ సిరీస్‌ల్లో ధన్య చాలా హాట్‌గా కనిపించింది.
రెక్కీ వెబ్ సిరీస్‌లో ధన్య చాలా హాట్‌గా కనిపించింది. రాజుగారిగది సినిమా ధన్యకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ సినిమాలో ఆమె నటన చూసిన చాలామంది దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వాలనుకున్న కాలం కలిసి రాక ఛాన్సులు ఆమెకు రాలేదు. అయితే ఇప్పుడు ఆమె గురించి దిమ్మతిరిగిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఆమె ఓ స్టార్ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకుందట. ఈ పెళ్లి జరిగి కూడా సంవత్సరం అవుతుంది. ధన్య రెండో పెళ్లి మ్యాటర్ ఇప్పుడు లీక్ అయింది. ఆమె గురించి టాలీవుడ్ నటి కల్పిక గణేష్ ఒక వీడియో ద్వారా ఆమె రెండో పెళ్లి సంసారం గుట్టు రట్టు చేసింది.
ధన్య బాలకృష్ణ కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ఈ ఏడాది జనవరిలో రెండో పెళ్లి చేసుకుందని.. ఆమె మొదటి నుంచి కూడా చెన్నై వెళితే బాలాజీ మోహన్ తో అతడి రూమ్ లోనే ఉంటుందని కల్పిక తెలిపింది. అప్పటికే బాలాజీకి పెళ్లయి భార్య విడాకులు కూడా ఇచ్చాడని.. ఇప్పుడు ధన్య అతడిని వివాహం చేసుకొని సీక్రెట్ గా కాపురం చేస్తుందని కల్పిక తెలిపింది. అలాగే ప్రస్తుతం ధన్య నటించిన సినిమాలు వెబ్ సిరీస్ ల ప్రమోషన్లకు కూడా ఆమె రావడం లేదు.
దీనినిబట్టి ఇప్పుడు కల్పిక చెప్పిన విషయం నిజమేనా ? అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ధన్య బాలాజీ మోహన్ ను పెళ్లి చేసుకోవడంతో తాను ముందు ఎంతో భయపడ్డానని.. అతడు ఆమెను టార్చర్ పెడతాడని అనుకున్నానని.. అయితే ఇప్పుడు వారిద్దరూ చాలా బాగానే సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం కల్పిక చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.