Moviesఆ మూడ్ లేదా..? బన్నీ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ వింటే మైండ్...

ఆ మూడ్ లేదా..? బన్నీ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందరూ ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు . టాలీవుడ్ – బాలీవుడ్ – కోలీవుడ్ లో ప్రముఖులు ప్రేమించిన అబ్బాయిని అమ్మాయిని పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు . దీంతో ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పై అందరికన్ను పడింది. ఈ క్రమంలోనే బన్నీ హాట్ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

చమ్మక్ చల్లో సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన బ్యూటీ కేథ‌రిన్ థ్రెసా. మొదటి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. ఇక తర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలు అంటూ హాట్ రొమాన్స్ చేసి తన పేరును జనాలకు గుర్తుండిపోయేలా మార్చుకునింది. రీసెంట్ గానే బింబిసారాలో నటించి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . కాగా తమిళ్- కన్నడ- మలయాళ భాషల్లోనూ కేథరిన్ సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది .

అయితే ఎక్కడా కూడా కేథరిన్ కి స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు . ప్రజెంట్ వచ్చిన అవకాశాలతో నెట్టుకొస్తున్న ఈ బ్యూటీ రీసెంట్గా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లిపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది . 33 ఏళ్ళు దాటేస్తున్నా..ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఏంటి అంటూ ప్రశ్నించగా.. “అప్పుడే పెళ్ళా..? నాకు తొందరేముంది .. నాకు పెళ్లి చేసుకునే మూడ్ కూడా లేదు . ఇంకో ఐదు ఆరేళ్లు ఇలాగే ఉంటాను. నేను నా డ్రీమ్స్ ఫుల్ ఫిల్ చేసుకున్నాకనే పెళ్లి గురించి ఆలోచిస్తా.. “అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలని ..తగినంత హైట్ ..కొంచెం వెయిట్.. ఫుడ్ పట్ల మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పకు వచ్చింది. ప్రజెంట్ కేథరిన్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news