టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటే నటులలో బ్రహ్మాజీ కూడా ఒకరు. నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జున ఫ్రెండ్ గా నటించిన బ్రహ్మాజీ తన నటనతో ఆకట్టుకున్నారు. బ్రహ్మాజీ నిన్నే పెళ్లాడతా సినిమాతో పాటూ సింధూరం, గులాబి లాంటి సూపర్ హిట్ చిత్రాలలోనూ నటించారు. ఆ సమయంలోనే రివితేజ, కృష్ణ వంశీలతో పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మాజీ వరుస సినిమాలలో నటిస్తున్నారు.
ఒకప్పుడు నెగిటివ్ రోల్స్ చేసిన బ్రహ్మాజీ అతడు సినిమా నుండి ఎక్కువగా కామెడీ పాత్రలలో నటిస్తు మెప్పిస్తున్నారు. రీసెంట్ గా డీజే టిల్లు సినిమాతో నటించి నవ్వులు పూయించారు. కేవలం సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన దైన స్టైల్ లో బ్రహ్మాజీ పంచ్ లు వేస్తుంటారు. ఇదిలా ఉంటే బ్రహ్మాజీ సినిమాల గురించి అందరికీ తెలుసు.
కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. బ్రహ్మాజీ ప్రేమ, పెళ్లి గురించి తెలిస్తే మాత్రం ఆయనను మెచ్చుకోని వాళ్లు ఉండరేమో. బ్రహ్మాజీ తండ్రి సోమయాజులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సినిమాలలో నటించేవారు. కే.విశ్వనాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసిన ఆయన ఎంతో మందికి పరిచయం అయ్యారు. బ్రహ్మాజీకి కూడా చిన్నతనం నుంచి సినిమాల పై ఆసక్తి ఉండటంతో చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో నటన నేర్చుకున్నాడు.
బ్రహ్మాజీ సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకున్నాడు. చెన్నై లో తనకు పరిచయం అయిన బెంగాలీ మహిళ ను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆ బెంగాలి మహిళకు కుమారుడు ఉండగా భర్తతో విడాకులు తీసుకున్నారు. ఇక బ్రహ్మాజీ పిల్లలను కనకపోవడం వెనక కూడా ఓ కారణం ఉందట. అప్పటికే తాను ప్రేమించిన మహిళకు ఓ బాబు ఉండటంతో మళ్లీ పిల్లలను కనకూడదు అని నిర్ణయం తీసుకున్నాడట.
ఒకవేళ తాను మళ్లీ తన భార్యతో పిల్లలను కంటే ఇద్దరు పిల్లలను పెంచే క్రమంలో, వారిపై సమాన ప్రేమ చూపించే విషయంలో ఇబ్బందులు వస్తాయనే బ్రహ్మాజీ తన భార్యను ఇబ్బంది పెట్టకూడదని ఈ డెసిషన్ తీసుకున్నాడట. ఆ కారణం వల్లనే బ్రహ్మాజీ పిల్లలను కనకుండా ఉండిపోయాడు. ఈ విషయాలను బ్రహ్మాజీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.