అయ్యయ్యో.. పాపం తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు .. భారీ అంచనాల నడుమ మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో రిలీజ్ కానున్న మాస్ మహారాజా రవితేజ మూవీ ధమాకాకు బిగ్ షాక్ ఎదురైంది . మనకు తెలిసిందే టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ , అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ధమాకా. మల్టీ టాలెంటెడ్ త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది .
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ , ట్రైలర్ , పోస్టర్స్, పాటలు అభిమానులను భారీగా ఎక్స్పెక్ట్ చేసేలా చేసింది . ఈ క్రమంలోనే రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ అంచనాలను నెలకొల్పింది. కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల్లో దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన మాట్లాడుతూ.. ” ఏంటి నీ ఉప్పర్ లొల్లి” అంటూ హేళన చేసి మాట్లాడారని ఆ సంఘం వారు మండిపడ్డారు” .
తమ కులస్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు . తెలంగాణ నగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో కులస్తులు ఫిలిం ఛాంబర్ వద్ద ఆందోళన చేశారు . అంతేకాదు డైరెక్టర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు నినాదాలు చేస్తూ రచ్చ రచ్చ చేశారు .ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడిన మాటలకు సారీ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ క్రమంలోనే ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి సినిమాను ఆపేయాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ బైఠాయించారు . ఈ క్రమంలోని రవితేజ నటించిన ధమాకా సినిమా రిలీజ్ కి ముందే ఇలాంటి చిక్కుల్లో పడటం సంచలనంగా మారింది.