యస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ పై సోషల్ మీడియాలో కాంట్రవర్షీయల్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది. జబర్దస్త్ లో స్కిట్స్ వేసే కమెడియన్స్ కి సరిగ్గా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని.. చెక్ పేమెంట్ ఆలస్యంగా చేస్తారని.. ఎవరైతే స్కిట్స్ లో బాగా చేశారో ..వాళ్లకే ముందు డబ్బులు ఇచ్చేస్తారని.. చిన్నాచితకా స్కిట్స్ వేసిన వాళ్ళకి ఖాళీ చేతులే మిగులుతాయి అన్న కామెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తున్నాయి .
అంతేకాదు జబర్దస్త్ లో వల్గర్ కంటెంట్ ఎక్కువైపోతున్నాయని.. బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా హద్దులు మీరుతున్నాయని..అందుకే అనసూయ కూడా ఈ షో నుంచి తప్పుకుంది. ఇదే క్రమంలో కొత్తగా జబర్దస్త్ లోకి యాంకర్ సౌమ్య అడుగు పెట్టింది . అయితే మూడు , నాలుగు ఎపిసోడ్ పద్ధతిగా చేసిన సౌమ్య సైతం హైపర్ ఆది లాంటివాళ్ల డబల్ మీనింగ్ డైలాగ్స్ కి బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ఆమెని ఇబ్బంది పెడుతున్నారట.
ఈ క్రమంలోనే ఆమె అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుని మరి యాంకర్ సౌమ్య జబర్దస్త్ షో నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అనసూయ చెప్పిన బాడీ షేమింగ్ కామెంట్స్ నిజమే అని జనాలు అభిప్రాయపడుతున్నారు . చూడాలి మరి యాంకర్ సౌమ్య దీనిపై ఎలా స్పందిస్తుందో..? ఏది ఏమైనా సరే ..జబర్ధస్త్ షో కి నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువ అయిపోయాయి అన్నది మాత్రం వాస్తవం..!!