Moviesఆ విషయంలో కృతిశెట్టి తెగ నచ్చేసిందట.. ఫస్ట్ టైం ఓ హీరోయిన్...

ఆ విషయంలో కృతిశెట్టి తెగ నచ్చేసిందట.. ఫస్ట్ టైం ఓ హీరోయిన్ ని ఈ రేంజ్ లో పొగిడేసిన బాలయ్య..!?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి పేరు ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు . బాలయ్య అని పేరు చెప్పగానే అందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది ఆయన కోపం ఎందుకంటే ..బాలయ్య ఉన్నది ఉన్నట్టు ముఖానే మాట్లాడేస్తాడు. తప్పు చేస్తే ఎదుటివాడు ఎంతటి వాడైనా సరే చెడ మడ తిట్టేస్తాడు. అందుకే బాలయ్యతో మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అంటూ ఉంటారు అభిమానులు .

కాగా రీసెంట్ గానే వీర సింహారెడ్డి షూటింగ్లో కాస్ట్యూమ్ డిజైనర్ తో బాలయ్య గొడవ గురించి అందరికీ తెలిసిందే. కాస్ట్యూమ్ విషయంలో బాలయ్యను డీప్ గా హర్ట్ చేసిన ఆయన అందరి ముందే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు . ఈ క్రమంలోనే ఆయన హర్ట్ అయినట్లు తెలుస్తుంది. కాగా బాలయ్య కోపం గురించి గ్రహించిన యంగ్ హీరోయిన్ ఆయనతో సినిమా అంటేనే భయపడిపోయి రిజెక్ట్ చేసిందట. ఆమె మరి ఎవరో కాదు .. టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి .

ఉప్పెన సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంటృఈ ఇచ్చిన హాట్ బ్యూటీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . క్రేజీ అవకాశాలతో నెట్టుకొస్తున్న కృత్తి శెట్టి బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకకుతున్న సినిమాలో అవకాశం వచ్చినా సరే రిజెక్ట్ చేసిందట. ఈ క్రమంలోనే బాలయ్య కోపం గురించి తెలుసుకున్న కృతిశెట్టి ఆయనతో సినిమాను రిజెక్ట్ చేసిందట. అయితే తనతో సినిమా రిజెక్ట్ చేసింది అని తెలిసినా సరే కృతి శెట్టి అమాయకత్వం ..ఇతరులతో నడుచుకునే పద్ధతి బాలయ్యకు చాలా నచ్చిందట. పెద్దవారిని గౌరవించడంలో కృతి శెట్టి ఈ కాలంలో ఈ యంగ్ హీరోయిన్స్ లో నెంబర్ వన్ అంటూ అని చెప్పుకొచ్చాడట బాలయ్య. ఏది ఏమైనా సరే ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ లో బాలయ్య చేత ఈ రేంజ్ లో పొగడ్తలు అందుకున్న హీరోయిన్ కృతి శెట్టినే కావడం గమనార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news