Movies1980లోనే హాలీవుడ్ సినిమాలో బాల‌య్య‌... ఆ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఇదే..!

1980లోనే హాలీవుడ్ సినిమాలో బాల‌య్య‌… ఆ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఇదే..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 106 సినిమాల్లో న‌టించాడు. వీర‌సింహారెడ్డి బాల‌య్య‌కు 107వ సినిమా. ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమా 108. బాల‌య్య కెరీర్ ప‌రంగా చూస్తే పౌరాణికం, సాంఘీకం, చారిత్ర‌కం, జాన‌ప‌దం ఇలా ఎన్నో క‌థ‌ల్లో న‌టించాడు. బాలయ్యకు ముందు నుంచి రిస్క్ చేయటం అలవాటు. తన కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 100వ సినిమాను గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ఆంధ్ర దేశాన్ని పాలించిన రాజు కథతో చేస్తాడని ఎవరు ఊహించలేదు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

బాలయ్య 1980వ దశకంలోనే హాలీవుడ్ స్టైల్ లో తెరకెక్కిన ఒక సినిమాలో నటించాడు. విజయభాస్కర ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధ‌నేకుల మురళీమోహన్‌రావు నిర్మించిన దేశోద్ధారకుడు అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ప్రముఖ క‌న్న‌డ‌ దర్శకుడు ఎస్ఎస్ రవిచంద్రకు తెలుగులో ఇదే తొలి సినిమా. విజయశాంతి హీరోయిన్‌గా నటించగా చక్రవర్తి స్వరాలు అందించారు. ఈ సినిమాలో బాలయ్య గోపి అని అల్లరి చిల్లరగా తిరిగే యువకుడి పాత్రలో కనిపిస్తారు. అన్యాయాలను ఎదిరిస్తూ ఉండడంతో పాటు.. గ్రామీణ రాజకీయాలను అణిచివేస్తాడు. చివరకు దేశోద్ధారకుడుగా కీర్తించబడతాడు.

1985 డిసెంబర్ 6న కోయంబత్తూర్ సమీపంలోని ఆశియార్ డ్యాం వ‌ద్ద ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. చెట్టు కింద నిలబడి ఉన్న హీరో బాలయ్య థ్యాంక్స్ అండి అమ్మాయిగారు ఏమిటి ఇలా వచ్చారు అని హీరోయిన్ విజయశాంతిని ఉద్దేశించి చెప్పటాన్ని తొలిషాట్‌గాగా దర్శకుడు రవిచంద్ర చిత్రీకరించారు. ఈ సినిమాలో బాలయ్య కథానుసారం రెండు అంతర్నాటకాల్లో సుయోధనుడిగాను , ఛ‌త్రపతి శివాజీ గాను కనిపించి అభిమానులను అలరిస్తారు.

విశ్వవిఖ్యాత హాలీవుడ్ దర్శకుడు డేవిడ్ లీన్ ఏ ప్యాసేజ్ టు ఇండియా సినిమాలో వాడిన రథాన్ని అతి కష్టం మీద తీసుకొచ్చి ఇక్కడ వాడారు. అలాగే 1933లో మోడల్ ఇంపోర్టెడ్ ఆస్టిన్ కారు ఎనిమిది రేసుల్లో అవార్డులు సాధించింది. ఈ కారును కూడా ఈ సినిమాలో సత్యనారాయణ కోసం వాడారు. సినిమా కోసం భారీగా ఖ‌ర్చు చేశారు. ఈ సినిమా కొన్ని హాలీవుడ్ సినిమాల‌కు స్ఫూర్తి అంటారు. ముందు ఈ సినిమాకు దేశోద్ధార‌కుడు రావాలి అన్న టైటిల్ అనుకుని త‌ర్వాత దేశోద్ధార‌కుడుగా మార్చారు.

1986 ఆగ‌స్టు 7న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. బాలకృష్ణ‌కు క్లాస్‌, మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. చాలా కేంద్రాల‌లో 100 రోజులు ఆడింది. ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా విజ‌య‌వాడ అలంకార్ థియేట‌ర్ వ‌ద్ద ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తైన క‌టౌట్ అప్ప‌ట్లో టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news