నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంత డేరో చెప్పక్కర్లేదు. ఫైట్లు చేసేటప్పుడు డూపులు పెట్టుకుని చేయడం అంటేనే బాలయ్యక చిరాకు. బాలయ్యతో చేసిన ఫైట్ మాస్టర్లకే ఆయన డేరింగ్‌గా ఫైట్లు చేస్తుంటే భయం వేస్తూ ఉంటుంది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో పైన కోటమీద నుంచి దూకేటప్పుడు డూపును పెడదామని రామ్ – లక్ష్మన్ మాస్టర్లు చెపితే బాలయ్య వద్దని ఆయనే స్వయంగా ఆ యాక్షన్ సీన్ చేశారు. ఇక అదే సినిమాలో గుర్రంపై రైడింగ్ చేసేటప్పుడు కూడా గుర్రంపై ఎక్కి స్వారీ చేయాల్సి ఉంటుంది. ఫైట్ మాస్టర్లు వద్దని వారిస్తున్నా బాలయ్య గుర్రం ఎక్కి దానిని ఉరికించి లొంగదీసుకుని దానిపై నుంచే యాక్షన్ సీన్ చేశారట.
బాలయ్య అంటేనే డేర్.. కొన్ని సినిమాల్లో ట్రైన్ మీద పరిగెత్తుతూ కూడా డేరింగ్‌గా యాక్షన్ సీన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే డేరింగ్‌ను ఆయన పెద్ద కుమార్తె బ్రాహ్మణి కూడా పునికిపుచ్చుకున్నట్టుగా ఉంది. ఆమె తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో బైక్ ట్రావెలర్‌గా అడ్వెంచర్ల గురించి చెప్పారు. తాను జమ్మూ కశ్మిర్‌లోని లేహ్ ప్రాంతానికి వెళ్లినప్పుడు చేసిన బైక్ రైడింగ్ గురించి చెప్పారు. ఉదయం లేహ్ నుంచి థిక్సే మాంటెస్సరీకి బయలుదేరామని.. అక్కడ టిఫిన్, మెడిటేషన్ కూడా చేయాల్సి ఉందని ఆమె తెలిపారు.
బ్రాహ్మణికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. బ్రాహ్మణి చాలా గ్రేట్ అని.. మా బాలయ్య బాబు కూతురు సూపర్ అని తెలుగు తమ్ముళ్లు, నందమూరి అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా బ్రాహ్మణి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
బ్రాహ్మణి ఇప్పటికే బెస్ట్ బిజినెస్ వుమెన్‌గా తనను తాను ఫ్రూవ్ చేసుకుంది. తన పని తాను చూసుకోవడమే తప్పా ఎప్పుడూ బయట వ్యవహారాలను ఆమె పట్టించుకోదు. అంత క్రేజ్ ఉన్నా కూడా సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం పాకులాడదు. హెరిటేజ్ సంస్థల బాధ్యతలను చూస్తూ బాగా సక్సెస్ ఫుల్ అయ్యారు. ఇలా బ్రాహ్మణి ఇప్పుడు ట్రావెలర్‌గా తనలోని కొత్త కోణంతో హైలెట్ అయ్యారు.