Moviesఆ హీరోయిన్‌తో ఎన్టీఆర్ కాంబినేష‌న్ ఎవ్వ‌రికి ఇష్టం లేదా... ఎన్టీఆర్ హ‌ర్ట్...

ఆ హీరోయిన్‌తో ఎన్టీఆర్ కాంబినేష‌న్ ఎవ్వ‌రికి ఇష్టం లేదా… ఎన్టీఆర్ హ‌ర్ట్ అయ్యారా…!

సినిమాల్లో కాంబినేష‌న్‌కు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌ట్లో మాదిరిగా అప్ప‌ట్లో స్కిన్ షో ఉండేదికాదు. దీంతో హీరో, హీరోయిన్ల‌ను ఆచితూచి ఎంపిక చేసుకునేవారు. వారి న‌ట‌న‌పైనే ఎక్కువ‌గా ద‌ర్శ‌కుడు, నిర్మాతలు ఆధార‌ప‌డేవారు. ఇలా ఎంపిక చేసుకున్నా.. చాలా సినిమాలు హిట్లు కొట్టిన సంద‌ర్బాలు ఉన్నాయి. అదే స‌మ‌యంలో కొన్ని ఫెయిల్ అయిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. హీరోల‌కు కొంద‌రు హీరోయిన్లు అదిరిపోయే కాంబినేష‌న్‌గా ఉంటే, మ‌రి కొంద‌రు హీరోయిన్లు మాత్రం బాగా డిజ‌ప్పాయింట్మెంట్ కాంబినేష‌న్‌గా ఉంటారు.

సీనియ‌ర్ ఎన్టీఆర్ ఖాతాలో కూడా క‌లిసి రాని ఓ హీరోయిన్ ఉన్నారు. ఆవిడే.. షావుకారు జాన‌కి. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లోనే షావుకారు సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో అన్న‌గారితో క‌లిసి.. జాన‌కి న‌టించారు. అయితే, అన్న‌గారికి పేరు రాలేదు. కానీ, సోలోగా జాన‌కికి మాత్రం పెద్ద పేరు వ‌చ్చింది. కానీ, హీరోయిన్గా కంటే కూడా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానే పేరు వ‌చ్చింది. పైగా సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు.

క‌థ బాగున్నా ఎన్టీఆర్‌ను డ‌మ్మీ చేశార‌నే టాక్ వ‌చ్చేసింది. దీంతో ఈ సినిమా క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌లేక పోయింది. దీంతో అన్న‌గారు చాలా హ‌ర్ట్ అయ్యారు. ఆ త‌ర్వాత షావుకారు జాన‌కీతో న‌టించేందుకు ఆయ‌న పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేద‌నే అంటారు. ఈ సినిమా దెబ్బ‌తో నిర్మాత కూడా భారీగానే న‌ష్ట‌పోయాడు. ఇక‌, ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ క‌న్యాశుల్కంలో జాన‌కికి అవ‌కాశం ఇచ్చినా ఆమెకు కేవ‌లం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు పాత్ర‌తోనే స‌రిపెట్టారు.

ఈ సినిమాలో సావిత్రికి ప్ర‌ధాన రోల్ ఇచ్చారు. ఇది బాగానే ఆడింది. కానీ, షావుకారు సినిమా ఎఫెక్ట్‌తో ఎన్టీఆర్‌-.జాన‌కిల కాంబినేష‌న్ త‌ర్వాత .. ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో జాన‌కి త‌మిళ‌సినిమాల‌పై మొగ్గు చూపారు. అక్క‌డ హీరోయిన్‌గా న‌టించినా.. తెలుగులో మాత్రం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానే ప‌రిమితం అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news