Moviesస్టార్ హీరో సన్స్ కి షాక్ ఇచ్చిన విశ్వక్ సేన్ .....

స్టార్ హీరో సన్స్ కి షాక్ ఇచ్చిన విశ్వక్ సేన్ .. ఇప్పుడు ఆన్సర్ ఇవ్వండ్రా బిగ్ స్టార్స్..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావడం పెద్ద గొప్ప కాదు . వచ్చిన తర్వాత సక్సెస్ అందుకుంటూ ..తనదైన స్టైల్ లో ఆ పేరుని 10 కాలాలపాటు ఇండస్ట్రీలో చెరగనీయకుండా పెంపొందించే వాడే నిజమైన హీరో. అయితే అలాంటి లక్షణాలు అన్ని హీరో విశ్వక్ సేన్ కు పుష్కలంగా ఉన్నాయి అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . మల్టీ టాలెంటెడ్ గల విశ్వక్ సేన్.. ఎలాంటి పాత్రనైనా సరే ఒదిగిపోయి నటిస్తాడు.

కాగా గతంలో విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ప్రాంక్ ఎంత ఇష్యూ అయిందో తెలిసిందే. ఏకంగా ప్రముఖ టీవీ ఛానల్ తో గొడవకు దిగాడు . అప్పట్లో ఆ విషయం వైరల్ గా మారింది . రీసెంట్గా “ఓరి దేవుడో”.. సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుందామనుకున్న విశ్వక్ సేన్ కి కాంతారా సినిమా బ్రేక్ వేసింది. ఈ సినిమా కారణంగా అనుకున్నంత హిట్ కాలేకపోయింది . ఇప్పుడు తన ఆశలన్ని నెక్స్ట్ సినిమా పైన పెట్టుకొని ఉన్నాడు విశ్వక్ సేన్.


ఇప్పటికే చేతిలో రెండు సినిమాలతో బిజీ గా ఉన్న విశ్వ.. రీసెంట్గా మరో క్రేజీ కాంబోకి తెర లేపినట్టు తెలుస్తుంది. సింగర్ గీతామాధురి హస్బెండ్ నందు తో సవారి అంటూ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ సాహిత్ తో విశ్వక్సేన్ మరో భారీ సినిమాను తీయబోతున్నట్లు తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం కాలేజీ నేపథ్యంలో సాగే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని.. ఈ సినిమాలో విశ్వక్సేన్ సరికొత్త రోల్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది . అంతేకాదు సినిమా కోసం దాదాపు ఏకంగా 25 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని టాక్ వైరల్ గా మారింది. నిజంగా ఇది గ్రేట్ అంటున్నారు జనాలు. విశ్వక్ సేన్ లాంటి చిన్న హీరోకి 25 కోట్ల బడ్జెట్ అంటే పెద్ద సాహసం అని చెప్పాలి . విశ్వక్ సేన్ లో టాలెంట్ ఉందని కేవలం బడా హీరోలకే కోట్లు పెట్టాలా.. చిన్న హీరోలకి కోట్లు పెడితే ప్రాఫిట్ రాదా అంటూ జనాలు నిలదీస్తున్నారు. అంతే కాదు కావాలనే కొందరు విశ్వక్ సేన్ ని టార్గెట్ చేశారని మండిపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news