మంజిమ మోహన్.. ఈ పేరు వినగానే తెలుగులో ఆమె హీరోయిన్‌గా నటించిన సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమా గుర్తొస్తుంది. గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించాడు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. సినిమా ఇక్కడ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే, తమిళ వాసన వల్ల ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. దాంతో మళ్ళీ మంజిమ మోహన్ తెలుగులో కనిపించలేదు.
తెలుగులో కంటే మంజిమ తమిళ..మలయాళ సినిమాలలో బాగా పాపులారిటీని తెచ్చుకుంది. చెప్పాలంటే మంజిమ హీరోయిన్ కాకముందే తెరకి పరిచయమైంది. బాల నటిగా పలు హిట్ సినిమాలలో నటించి ఆకట్టుకుంది. అదే అమ్మడిని హీరోయిన్ అయ్యేలా చేసింది. కేరళలో పుట్టిన మంజిమ 2015లో మలయాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 1998 నుంచి 2022 వరకు బాల నటిగా ఆ తర్వాత కొన్నేళ్ళ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం అనుకోకుండా జరిగిపోయాయి.
హీరోయిన్‌గా మంజిమ మోహన్ చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా కూడా అవి తనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. సాహసం శ్వాసగా సాగిపో తమిళ వెర్షన్‌లోని పర్ఫార్మెన్స్‌కు గానూ మంజిమ ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ పురస్కారాన్ని దక్కించుకుంది. అలా తమిళంలో అమ్మడు ఎక్కువ సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. అయితే, మంజిమ తెలుగులో ఓ వెలుగు వెలుగుతుందీ అని అందరూ అనుకున్నారు.
కానీ, ఆ ఛాన్స్ మిస్ అయింది. మొదటి సినిమా తర్వాత తర్వాత టాలీవుడ్ మేకర్స్ పట్టించుకోలేదు. దీనికి కారణం మంజిమ బాగా బొద్దుగా ఉండటమే. మన దగ్గర హీరోయిన్ ఎంత నాజూకుగా ఉంటే అంతగా అవకాశాలను సంపాదించుకుంటారు. దీనికి పూర్తి రివర్స్‌లో తమిళం గానీ..మలయాళం భాషలలోగానీ హీరోయిన్ బొద్దుగా ఉంటే ఏకంగా గుడి కట్టేస్తారు. అందుకే, తెలుగులో హిట్ అందుకున్నా కూడా మన మేకర్స్ లైట్ తీసుకున్నారు.
అప్పటికే మళయాళ ముద్దుగుమ్మలు అందరూ వరుసగా టాలీవుడ్‌ను ఏలేస్తుండడంతో మంజిమా కూడా ఇక్కడ ఛాన్సుల కోసం కొన్ని ట్రైల్స్ వేసింది. అయితే ఆమె కాంటాక్ట్ అయిన దర్శక, నిర్మాతలు అందరూ కూడా ఆమె కాస్త ఒళ్లు చేసి ఉండడంతో ఇక్కడ హీరోల పక్కన సెట్ కాదని.. ఆమెను ఇక్కడ ప్రేక్షకులు ఇష్టపడరని నో చెప్పేయడంతో ఆమెకు ఇక్కడ ఛాన్సులు రాలేదు.