Moviesమ‌హేష్‌ను గోక‌టానికి ఆ హీరోయిన్లు ట్రై చేశారా... ఏం జ‌రిగింది...!

మ‌హేష్‌ను గోక‌టానికి ఆ హీరోయిన్లు ట్రై చేశారా… ఏం జ‌రిగింది…!

సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు సన్నిహితంగా ఉండటం.. స్నేహితులుగా మారటం ఆ తర్వాత కాలంలో వారి మధ్య సంథింగ్ సంథింగ్ నడవడం చాలా మామూలు విషయం. ఇది ఇప్పుడు మాత్రమే కాదు గత కొన్ని దశాబ్దాల నుంచి అన్ని సినిమా ఇండస్ట్రీలలోను కొనసాగుతూ వస్తోంది. తెలుగు సినిమా రంగంలోనూ 1960ల‌ నుంచి హీరో, హీరోయిన్ల మధ్య రాసుకుపూసుకుని తిరగటాలు సంథింగ్ సంథింగ్ కార్యక్రమాలు జరిగేవి.

 

చాలామంది హీరోలు, హీరోయిన్ల విషయంలో వార్తలు.. గాసిప్‌లు బైటికి వచ్చిన కొంతమంది హీరోల విషయంలో మాత్రం ఎలాంటి గాసిప్‌లు బయటకు రాలేదు. ఉదాహరణకు సీనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇలాంటి గాసిప్ లు పెద్దగా వినిపించేవి కావు. ఒక్క కృష్ణకుమారి విషయంలోనే ఆయన ఏదో మనసు పడ్డారన్న ప్రచారం అయితే జరిగింది. ఇక టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఒకప్పటి హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ ను వివాహం చేసుకున్నాడు.

మహేష్ తన 22 ఏళ్ల సినిమా కెరియర్ లో ఎన్నో సినిమాల్లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి నటించాడు. అయితే ఏ హీరోయిన్ తోను మహేష్ చాలా చనువుగా ఉన్నాడని… రాసుకుపూసుకు తిరిగాడన్న గాసిప్‌లు ఎప్పుడూ బయటకు రాలేదు. ఒక్క నమ్రతతో ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం మాత్రమే జరిగింది. అంతేకానీ ఏ హీరోయిన్ విషయంలోనూ మహేష్‌కు లింకులు పెట్టి ఎవ్వరు వార్తలు రాయలేదు. అయితే దీనిపై మహేష్ ను ఓ ప్రముఖ ఛానల్ అధినేత తన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

మీరు ఇంత ఎర్రగా బుర్రగా హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా ? మీ భార్య నమ్రత మిమ్మలను ఏ హీరోయిన్ అయినా బుట్టలో వేసుకుంటుందని ఫీలయ్యారా అంటే అలాంటి సిల్లీ ఆలోచనలు నమ్రతకు రావని మహేష్ సింపుల్‌గా ఆన్సర్ చేశాడు. ఇక ఏ హీరోయిన్ అయినా నిన్ను గోకటానికి ట్రై చేసిందా అన్న ప్రశ్నకు మనం స్ట్రిక్టుగా ఉండడంతో పాటు.. పర్ఫెక్ట్ గా మన పని చేసుకుంటూ పోతుంటే మనలను ఎవరు టచ్ చేయరని మహేష్ ఆన్సర్ చేశాడు. మహేష్ చెప్పినదాన్ని బట్టి చూస్తే మన వైపు నుంచి ఏదైనా అలుసు లేకపోతే …మనలను టచ్ చేసేందుకు ఏ హీరోయిన్ కూడా సాహసించదని క్లారిటీ ఇచ్చిన‌ట్ల‌య్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news