Moviesసైలెంట్ షాక్: పెళ్లి చేసుకోబోతున్న నాని హీరోయిన్..అసలు ఊహించలేదుగా..!!

సైలెంట్ షాక్: పెళ్లి చేసుకోబోతున్న నాని హీరోయిన్..అసలు ఊహించలేదుగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు . ఇప్పటికే టాలీవుడ్ ,బాలీవుడ్ ,కోలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వగా ..రీసెంట్ గా ఆ లిస్టులోకే యాడ్ అవ్వబోతుంది మరో స్టార్ హీరోయిన్ అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే రీసెంట్ గానే కోలీవుడ్ బ్యూటీ మంజిమా మోహన్.. కార్తీక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి సంబంధించిన పెళ్లి పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

ఇలాంటి క్రమంలోనే మరో స్టార్ హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది . కన్నడ బ్యూటీగా పేరు సంపాదించుకున్న హరిప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలుగులోను పలు సినిమాల్లో నటించి మెప్పించింది . మరీ ముఖ్యంగా నానితో కలిసి పిల్ల జమిందార్ అనే సినిమాలో నటించి క్రేజ్ సంపాదించుకుంది . కాగా కన్నడ లో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలుతున్న హరిప్రియ త్వరలోనే కన్నడ హీరో వశిష్ట సింహాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది .

గత కొంతకాలంగా వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చాలాసార్లు మీడియా కంటికి పబ్లిక్ గా చిక్కారు . ఈ మధ్యనే ఇంస్టాగ్రామ్ లో కూడా ఇద్దరూ అఫీషియల్ గా తమ ప్రేమను చెప్పకనే చెప్పేశారు . ఈ క్రమంలోనే రీసెంట్గా దుబాయ్ లో వాళ్ళ పెళ్లి షాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది . డిసెంబర్ 4న వీళ్ల ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఫిబ్రవరి రెండో వారంలో పెళ్లి జరగబోతుందట . ఏది ఏమైనా సరే ఇలా అందాల ముద్దుగుమ్మలు అందరూ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతుంటే కుర్రాళ్ళు బాధపడిపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news