ముద్దుగా బొద్దుగా ఉన్న యంగ్ హీరోయిన్స్‌లో నందిత శేత ఒకరు. ఇండస్ట్రీకొచ్చినప్పటి నుంచీ మంచి హిట్స్ గనక పడి ఉంటే ఈ పాటికే మంచి స్టార్ హీరోయిన్ అయ్యేది. కానీ, ఎందుకనో నందితను అంతగా పట్టించుకున్నవారు లేరు. సాధారణంగా తమిళంలో సూపర్ హిట్స్ చేసిన హీరోయిన్స్ తెలుగులోనూ క్రేజీ హీరోయిన్స్‌గా వెలుగుతారు. ఇక్కడ స్టార్ హీరోయిన్గా వెలిగిన వారూ తమిళంలో స్టార్ హీరోయిన్గా ఏలతారు.
నందిత శేత కన్నడలో నటించిన మొదటి సినిమా నంద లవ్స్ నందిత. 2008లో ఈ సినిమా వచ్చింది. కన్నడలో తన మొదటి సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఆ తర్వాత తమిళంలో అవకాశం వచ్చింది. నందిత నటించిన మొదటి సినిమా తమిళ సినిమా కూడా మంచి హిట్ సాధించింది. దాంతో తమిళ ప్రేక్షకులకి తగ్గట్టుగా బొద్దు భామ కావడంతో అక్కడ వరుసగా దాదాపు 10 సినిమాలు చేసు క్రేజ్ తెచ్చుకుంది. అదే క్రేజ్ తెలుగులో అవకాశం తెచ్చిపెట్టింది.
2016 లో ఎక్కడికి పోతావుచిన్నవాడా అనే సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నందిత మంచి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమాలో నందిత చేసింది సెకండ్ లీడ్. అదే తనకి మైనస్ అయింది. మంచి బొద్దు భామ..నాభి అందాల ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. రొమాంటిక్ సీన్స్‌లో నొక్కేసినా అలరిస్తుంది. చెప్పాలంటే కుర్రాళ్ళకి నందిత కలల రాణి అనుకోవచ్చు. కానీ, ఇక్కడ కమర్షియల్ హీరోయిన్గా సక్సెస్ సాధిస్తేనే అవకాశాలు. లేదంటే ఎంత అందాలు ఆరబోసిన అవి వృధానే.
నందిత శేత విషయంలో కూడా అదే జరిగింది. శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, అభినేత్రి 2 లాంటి సినిమాలలో నటించినా నందిత అందానికి తగ్గ సినిమాలు మాత్రం రాలేదు.. హీరోయిన్గా ఎస్టాబ్లిష్ కాలేదు. అందుకే, ఇప్పుడు సినిమాలు కాకుండా బుల్లితెర మీద డాన్స్ షోకి జడ్జ్‌గా చేస్తుంది. అక్కడ కూడా తన క్యూట్ స్మైల్‌తో అలరిస్తుంది. ఆ షోలో మంచి గ్లామర్ డాల్‌గా ఆకట్టుకుంది. మరి హీరోయిన్గా ఈ అందాల భామ ఎప్పుడు బిజీ అవుతుందో తెలియదు.