సీనియర్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో నటించిన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది. ఒకానొక దశలో సినిమా ఇండస్ట్రీలో రంభ లేకపోతే ఏమైపోతుందో అన్నంత స్థాయికి ఇండస్ట్రీని తీసుకొచ్చేసింది ఈ బ్యూటి. ప్రతి సినిమాలోను రంభనే హీరోయిన్ గా కావాలంటూ స్టార్ హీరోస్ మొండి గా ఉండేవారట.
ఆ క్యూట్ నెస్, ఎక్స్ ప్రేషన్స్.. రంభలాగా ఎవరు చేయలేరంటూ జనాలు పొగిడేసేవారు . అయితే పెళ్లి చేసుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన రంభ.. రీసెంట్ గా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురైంది . ఈ విషయాన్ని స్వయాన్ని రంభనే చెప్పుకొచ్చింది . ఇంస్టాగ్రామ్ వేదికగా తాను కార్ యాక్సిడెంట్ కి గురయ్యానని చెప్పుకొచ్చింది . తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తున్న టైం లో ప్రమాదం జరిగిందని ప్రమాదంలో తన పిల్లలు తీవ్రంగా గాయపడ్డారని చెప్పుకొచ్చింది.
అంతేకాదు ఆ కారులోనే పిల్లలకు సంబంధించిన ఆయా కూడా ఉందని ..ఆమె కూడా తీవ్ర గాయాలు పాలు అయిందని చెప్పుకొచ్చింది . ఈ ప్రమాదానికి మూల కారణం ఓవర్ స్పీడ్ అంటూ అక్కడ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. రంభ కరెక్ట్ రూట్లోనే వెళ్తుందని అటువైపుగా వచ్చిన కారు ఓవర్ స్పీడ్ తో పొరపాటున రంభకారుని ఢీ కొట్టిందని.. ఈ క్రమంలోనే రంభ కారు తీవ్ర ప్రమాదానికి గురైందని అక్కడ జనాలు చెప్పుకొస్తున్నారు .
కెనడాకు చెందిన శ్రీలంక తమిళ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను రంభ వివాహం చేసుకుంది. వీరి ఇద్దురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం కెనడాలోని టొరంటోలో స్థిరపడ్డారు. ఇక్కడే ఆమె కార్ యాక్సిడెంట్ గురైంది ఈ క్రమంలోనే కార్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అని లేకపోతే ఎలాంటి ప్రమాదమైన జరగొచ్చని రంభ హెచ్చరించింది.