Moviesసమంత రేంజ్‌లో ఊహించుకుని త్రివిక్ర‌మ్ చేతిలో మోస‌పోయిన హీరోయిన్‌... ఏం జ‌రిగిందంటే..!

సమంత రేంజ్‌లో ఊహించుకుని త్రివిక్ర‌మ్ చేతిలో మోస‌పోయిన హీరోయిన్‌… ఏం జ‌రిగిందంటే..!

గురూజీ..మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక్కసారి హీరోయిన్‌గా నటించిన వారెవరైనా మళ్ళీ మళ్ళీ నటించే అవకాశాలు అందుకుంటున్నారు. ఎందుకంటే గురూజీ అంతగా తనకి ట్యూన్ చేసుకుంటారు. ముఖ్యంగా ఫస్ట్ లీడ్ హీరోయిన్ అంటే ఖచ్చితంగా ఆయన దర్శకత్వం వహించే నెక్స్ట్ సినిమాలో కూడా ఫిక్స్ అని అందరూ బ్లైండ్‌గా ఫిక్సవుతారు. దర్శకుడిగా చేసిన మొదటి రెండు సినిమాలలో నటించిన హీరోయిన్స్ మళ్ళీ రిపీట్ అవలేదు.

వారే శ్రియ శ్రన, త్రిష. తరుణ్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకుడిగా మారుతూ చేసిన సినిమా నువ్వే నువ్వే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రియకి మళ్ళీ రెండవసారి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కలేదు. త్రివిక్ర‌మ్ సినిమా చేశాక శ్రియ ఎంతో గొప్ప స్టార్ హీరోయిన్ అయ్యింది. అయినా త్రివిక్ర‌మ్ ఆమెకు మ‌రోసారి త‌న సినిమాల్లో ఛాన్సులు ఇవ్వ‌లేదు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందించిన అతడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన త్రిష కృష్ణన్ కూడా గురూజీ దర్శకత్వంలో మళ్ళీ నటించలేదు.

అయితే, జులాయి సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఇలియానా ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్‌ తెరకెక్కించిన జల్సా సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది. రెండూ సూపర్ హిట్సే. ఆ తర్వాత త్రివిక్రమ్‌ సినిమాలలో నటించిన స్టార్ హీరోయిన్ సమంత. ఆమె తర్వాత పూజా హెగ్డే. ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకున్న పూజాకి గురూజీ అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలతో భారీ హిట్స్ ఇచ్చాడు.

అదే అనూ ఇమ్మానియేల్ కూడా భావించింది. సమంత, ఇలియానా, పూజా హెగ్డే లాంటి స్టార్స్ మాదిరిగా అనూ కూడా ఆశ పడింది. కానీ, గురూజీ నట్టేట ముంచినంత పనిచేశాడు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసిన డిజాస్టర్ అయింది.. అదే అజ్ఞాతవాసి. ఈ సినిమాతో భారీ హిట్స్ అందుకుంటామని ఆశపడిన కీర్తి సురేష్, అనూ ఇమ్మానియేల్‌లకి దిమ్మ తిరిగింది. ముఖ్యంగా అనూ ఊహించింది త్రివిక్రమ్‌ తారుమారు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news