సన్నీ లియోన్ ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తనదైన హాట్ నెస్ తో కుర్రాలను టెంప్ట్ చేస్తూ ఉడికించే ఈ శృంగార తార రీసెంట్గా జిన్నా సినిమాలో నటించి తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకుంది . ప్రస్తుతం సన్నిలియోన్ బాలీవుడ్ చిత్రాలలో నటిస్తుంది . తెలుగులో కూడా సన్నిలియోన్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా గరుడవేగ మూవీలో ఐటమ్ సాంగ్ చేసి కుర్రాళ్లను ఉత్సాహపరిచింది. ప్రజెంట్ టాలీవుడ్ లో కూడా సన్నిలియోన్ కి ఐటం సాంగ్ ఆఫర్లు వస్తున్నాయి .
అయితే ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్న సన్నీలియోన్ రీసెంట్ గా తమిళ దర్శకుడు జయ మురుగన్ ‘తీ ఇవన్’ లో ఐటెం సాంగ్ కోసం సన్నీలియోన్ సంప్రదించారట. ఈ క్రమంలోనే ఆమె పెట్టిన కండిషన్స్ వైరల్ గా మారాయి. ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకున్న సన్నిలియోన్ రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా డిమాండ్ చేయలేదట. కానీ కొన్ని కండిషన్స్ మాత్రం కంపల్సరీ అంటూ పెద్ద చిట్టానే బయటపెట్టిందట. ఐటమ్ సాంగ్ చేస్తున్నప్పుడు చిన్న పిల్లలు ఎవ్వరూ ఉండకూడదు ..అలాగే కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి ..తన కో డాన్సర్లకి తగిన గౌరవం ఇవ్వాలి అని.. మరీ ముఖ్యంగా సెట్స్ లో పరాయి మగాళ్లు ఎవ్వరూ ఉండకూడదని ..కొరియోగ్రాఫర్ ,సినిమా హీరో ,డైరెక్టర్ ,కెమెరామెన్ అంతే . ఇంకెవరు ఉన్న నేను ఒప్పుకోనని ఖచ్చితంగా చెప్పిందట.
ఇలాంటి కండిషన్స్ అన్ని మీకు ఓకే అయితే ఆ తర్వాత రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకుని సాంగ్ ఫైనల్ అవుదాం అంటూ ఒక్కసారిగా డైరెక్టర్ కి బి షాక్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. అయితే సినీ ప్రముఖులు సైతం సన్నీలియోన్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. శృంగార తార అయినప్పటికీ పిల్లల విషయంలో చాలా కేరింగ్ గా ఉంటుందని ..తన జీవితం నాశనం అయిపోయినా సరే తన పిల్లల జీవితం నాశనం అవ్వకూడదని కోరుకుంటున్నావ్.. నిజంగా సన్నిలియోన్ గ్రేట్ అని చెప్పుకొస్తున్నారు .