టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు . అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుష్క ..మొదటి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. ఎలాంటి ఎక్స్ ప్రేషన్స్ ని అయినా పలికించే కళ్ళు.. చక్కటి వినయం అభిమానులను కట్టిపడేసింది. ఈ క్రమంలోనే దర్శకనిర్మాతలు ఆమెకు స్టార్స్ పక్కన అవకాశాలు ఇచ్చారు .
ఈ క్రమంలోనే అనుష్క శెట్టి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రెండు దశాబ్ధాల కాలం పాటు రాజ్యమేలేసింది. అంతేకాదు అనుష్క శెట్టి ఇప్పటికి హీరోయిన్గా సినిమాలు చేస్తుంది అంటే ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అనుష్క బెస్ట్ ఫ్రెండ్ ఆయన హీరో చెప్పిన కారణంగా కెరియర్లో సరిదిద్దుకోలేని తప్పు చేసిందట. టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా సన్ ఇచ్చిన సజీషన్ ని ఫాలో అయిన అనుష్క.. ఇప్పటికీ బాధపడుతుంది.
మనకు తెలిసిందే ..అనుష్క కెరియర్ లో పరమ చెత్త సినిమా ఏది అంటే సైజ్ జీరో. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 16 కేజీల బరువు పెరిగింది. ఈ సినిమా టైంలో అమ్మడిని అందరూ ట్రోల్ కూడా చేశారు . స్టార్ హీరో కొడుకు ఈ సినిమా చేయమని సజీషన్ చేశారట. దీంతో ఆ టైంలో అనుష్క ఆయన మాయలో పడిపోయి ఈ సినిమా చేసి ..సినిమా కోసం నిజంగానే బరువు పెరిగి ఇప్పటికే బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతుంది.
స్వతహాగా యోగ టీచర్ అయినా అనుష్క యోగాసనాలు వేసినా బరువు తగ్గడం లేదట. వెయిట్ ట్రోలింగ్స్ కారణంగానే ఆమె కొన్నాల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. ప్రజెంట్ నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తుంది. ఒక్కవేళ ఈ సినిమా హిట్ అయితే.. తన పూర్వ వైభవం తెచ్చుకుంటుంటుంది అంటున్నారు జనాలు. అనుష్క కెరీర్ నాశనం అవ్వడానికి పరోక్ష కారణమైయ్యాడు ఆ స్టార్ హీరో సన్..!!