సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.. మాయా ద్వీపం అంటుంటారు. ఇలా అనుకోవడానికి కారణం ఇక్కడ ఏ ఒక్కరు ఎప్పుడు నిజాయితీగా ఉండరనే కామెంట్స్ ప్రతీసారీ వినిపిస్తుండటమే. నిర్మాతతో దర్శకుడికి..హీరోకి..హీరోయిన్‌కి అవసరం. అలాగే వీరందరితోనూ నిర్మాతకీ అవసరం. ఇక్కడంతా లేనా దేనా పద్దతిలో సాగుతుంటుంది. నాకేమిస్తావు..నీకేం కావాలి అనే బిజినెస్ ఢీల్‌తోనే అంతా జరుగుతుంటుంది.
సినిమాను వందల కోట్ల వ్యారంగా మార్చిన ఘనత ఇండస్ట్రీలో హీరోయిన్స్‌తో సహా అందరిదీ అని చెప్పాలి. ఒక నిర్మాత తన మొదటి సినిమాను రు. 5 కోట్లు పెట్టి నిర్మిస్తే తరువాత ప్రాజెక్ట్‌ను మాత్రం రు.10 కోట్లు ఆ తర్వాత ప్రాజెక్ట్‌ను రు. 50 కోట్లు అని పెంచుకుంటూ వెళుతున్నాడు. వ్యాపారక విలువలను అసాధారణంగా పెంచేసే వాటిలో సినిమాకి అగ్ర స్థానం ఉంటుంది. ఇక ఇందులో అత్యంత కీలక పాత్ర హీరోయిన్‌దే అని చెప్పక తప్పదు.
మరీ ముఖ్యంగా కమర్షియల్ సినిమా అంటే హీరోయిన్ తెరపై చూపించే గ్లామర్ అనేదే ఓ స్ట్రాంగ్ ఫార్ములాగా ఫిక్స్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే తెరపై అందాలను ఆరబోసిన నటీమణులున్నారు. రాను రాను అది పక్కా కమర్షియల్ ఫార్ములాలలో ఒకటైంది. దీనికి అప్పటినుంచీ ఇప్పటివరకూ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కేంద్ర బిందువుగా మారారు. ఆయన తర్వాత రాం గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, కృష్ణవంశీలు ఇదే సక్సెస్ ఫార్ములాను పాటిస్తున్నారు.
రాఘవవేంద్ర రావు తర్వాత హీరోయిన్స్ నాభి సౌందర్యాన్ని అద్భుతంగా చూపిస్తున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన ఇదే విషయాన్ని ఓ సందర్భంలోనూ చెప్పుకొచ్చారు. హీరోయిన్స్‌ను గ్లామర్‌గా చూపించడంలో ప్రతీ దర్శకుడికి కొన్ని లెక్కలుంటాయి.. కొందరు హీరోయిన్ బొడ్డును అద్భుతంగా చూపించాలనుకుంటే కొందరు ఇంకేదో చూపించాలనుకుంటారు. అయితే హీరోయిన్ల బొడ్డు చూపిస్తే ఈ గ్లామర్ వేరు అని… ప్రేక్షకులకు ఆ మజా వేరుగా ఉంటుందన్నదే ఆ సీక్రెట్ అంటారాయన.
ఎవరు ఏది చేసినా సినిమా సక్సెస్ కోసమే అంటూ కుండబద్దలు కొట్టారు. అయినా కూడా సినిమా రిలీజై ప్రేక్షకులు జడ్జ్ చేయకుండానే ఫ్లాప్ అని రివ్యూస్ ఇస్తున్నారంటూ వాపోయిన సందర్భం ఉంది. నిజమే, కృష్ణవంశీ తీస్తున్న సినిమాలలో కొన్ని లెక్కలు ఖచ్చితంగా ఉన్నా కూడా డిజాస్టర్స్ అవుతున్నాయి.