Moviesపూర్తిగా మారిపోయిన అనసూయ.. భర్త తో ప్రత్యక పూజలు ..దాని కోసమేనా..?

పూర్తిగా మారిపోయిన అనసూయ.. భర్త తో ప్రత్యక పూజలు ..దాని కోసమేనా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో అనసూయ తన ఫ్యామిలీతో కలిసి జరుపుకున్న పూజకు తాలూకా పిక్స్ వైరల్ గా మారాయి . తన డైలీ రొటీన్ ను షేర్ చేసుకునే స్టార్ యాంకర్ అనసూయ ప్రజెంట్ తన సొంత ఊరిలో కులదైవం పూజ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనసూయ ఎలాంటి ట్రోలింగ్ కి గురైందో. లైగర్ సినిమా పై పరోక్షంగా చేసిన ట్వీట్ నే దానికి కారణం .

దీంతో అనసూయను ఆంటీ ఆంటీ అంటూ నానా విధాలుగా ఏడిపించారు కొందరు ఆకతాయిలు. అనసూయ సైతం ఏమాత్రం తగ్గకుండా వాళ్లకి ఘాటుగా రిప్లై ఇచ్చింది . అయితే యాంకర్ గా కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కూడా పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే అనసూయ జాతకం చూయించుకుందని ..జాతకంలో దోషం కారణంగానే దానికి తగ్గ పరిహార పూజలు చేస్తుందని ఓ న్యూస్ వైరల్ గా మారింది .

ఇలాంటి టైంలోనే అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో రీసెంట్గా పూజ చేసుకున్న ఫొటోస్ పిక్స్ అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోస్ లో అనసూయ చాలా క్యూట్ గా అచ్చం తెలుగింటి కోడలు లా పద్ధతిగా కనిపిస్తుంది. పింక్ శారీతో, గాజులు వేసుకుని..బొట్టు పెట్టుకుని..నగలు పెట్టుకుని చక్కగా అలంకరించుకుంది. దీంతో నెట్టిజెన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎప్పుడు ఇలాగే చీర కట్టుకొని చక్కగా ఉండొచ్చు కదా అనసూయ నీ..కు ఏ ప్రాబ్లం ఉండదు.. చూడు పిల్లలతో ఎంత హ్యాపీగా ఉన్నావో.. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి ..వేరే విషయాలను పట్టించుకోకు.. నీ లైఫ్ నీకు నచ్చినట్లు బ్రతుకు అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. దీంతో అనసూయ లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news