Moviesమ‌హేష్ - న‌మ్ర‌త ఫ‌స్ట్ ల‌వ్ ఎక్క‌డ‌... ఎవ‌రు ప్ర‌పోజ్ చేశారు......

మ‌హేష్ – న‌మ్ర‌త ఫ‌స్ట్ ల‌వ్ ఎక్క‌డ‌… ఎవ‌రు ప్ర‌పోజ్ చేశారు… కృష్ణ‌కు తెలిసి ఏం చేశారు..!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు 8 నెలల వ్య‌ధిలో ఏకంగా మూడు పెద్ద షాక్ లు తగిలాయి. ఈ ఏడాది జనవరిలో తన సోదరుడు రమేష్ బాబును కోల్పోయిన మహేష్. రెండు నెలల తేడాలో తల్లి ఇందిరా దేవితో పాటు తండ్రి కృష్ణను కూడా కోల్పోయాడు. తనకు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇచ్చి… కోట్లాదిమంది అభిమానులను ఇచ్చిన తండ్రి లేని బాధను మహేష్ దిగమింగుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ తండ్రి మరణం నుంచి కోలుకుని త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శ‌కత్వంలో తెర‌కెక్క‌ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నాడు.

ఇక మహేష్ భార్య నమ్రతకు మామ కృష్ణ గారంటే ఎంతో అభిమానం. కృష్ణను ఎంతో ఆప్యాయతతో చూసుకునేది. మహేష్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా హైదరాబాదులో ఉంటే ప్రతి శనివారం వీకెండ్ లో తండ్రితో కలిసి డిన్నర్ చేసేవాడట. ఇటు భార్య నమ్రతతో పాటు ఇద్దరు పిల్లలు.. తన సోదరీమ‌ణుల‌ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ డిన్నర్ లో పాల్గొనే వారట. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది నమ్రత. ఆమె మాజీ మిస్ ఇండియా కూడా..!

అలాంటి నమ్రత.. మహేష్ బాబుతో ఒకే ఒక సినిమా చేసింది. అది కూడా ప్లాప్ సినిమా.. ఆ సినిమా టైం లోనే మహేష్‌తో ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం అనూహ్యంగా జరిగిపోయాయి. అసలు మహేష్ – నమ్రత మధ్య ముందుగా ప్రేమ ఎప్పుడు ఎక్కడ చిగురించింది ? ఇద్దరిలో ఎవరు ప్రపోజ్ చేశారు అన్నది కాస్త ఆసక్తిగానే ఉంటుంది. వంశీ సినిమాలో పాటలతో పాటు కొన్ని సన్నివేశాల షూటింగ్ చేసేందుకు దర్శకుడు బి.గోపాల్ ఆస్ట్రేలియాలో 40 రోజులు పాటు లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ సమయంలో మహేష్.. నమ్రత చాలా వరకు కలిసే ఉన్నారు. అప్పుడే వారిద్దరి మధ్య మాటలు కలిసాయి.. స్నేహం చిగురించింది.

అక్క‌డ వంశీ షూటింగ్ ముగిశాక ఇండియాకు వచ్చారు.. వంశీ రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. అయితే మహేష్ – నమ్రత స్నేహం రోజురోజుకు మరింత బలపడింది. చివరకు అది ప్రేమగా మారింది. నమ్రత కోసం మహేష్ సీక్రెట్ గా అప్పట్లో ముంబై వెళ్లి వచ్చేవాడన్న పుకార్లు కూడా బయటకు వినిపించాయి.
ఇద్దరి మనసులు కలిసాయి ముందుగా మహేష్ ప్రపోజ్ చేశాడు.. నమ్రత వెంటనే ఓకే చెప్పేసింది.
తను నమ్రతను ప్రేమించిన విషయాన్ని తండ్రి కృష్ణకు చెప్పగా ఆర్ యు షూర్ అన్న ప్రశ్న వేశారట..!

మహేష్ మరోసారి షూర్ అని చెప్పిన వెంటనే పెళ్లికి ఒకే చెప్పేశారట. అయితే మహేష్ పెళ్లి ముంబైలో సీక్రెట్ గా చేసుకోవడం వెనక కూడా ఓ కారణం ఉంది. అప్పటికే మహేష్ కు తెలుగులో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన లక్షలాదిమంది అభిమానులతో పాటు మరింత మంది అభిమానులు తోడయ్యారు. దీంతో హైదరాబాద్‌లో పెళ్లి జరిగితే అభిమానులను కంట్రోల్ చేయడం కష్టం… హీరోయిన్‌తో పెళ్లి అంటే అభిమానులు ఫీల్ అవ‌తారేమో అన్న కారణంతో సింపుల్ గా ముంబైలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలా నార్త్ ఇండియన్ అమ్మాయి అయినా నమ్రత ఘట్టమనేని ఫ్యామిలీలో అలా కలిసిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news