శ్రీలీల… చదువుల తల్లి. ఎంబిబిఎస్ ఫైనల్ ఈయర్ చదువుతూ కూడా నటనలో చక్కగా రాణిస్తుంది. తన తల్లి లాగ డాక్టర్ అవ్వాలని కలలు కంటున్నా ఎవ్వరు ఊహించని విధంగా కన్నడ సినిమా ద్వారా మొదట హీరోయిన్ అయ్యింది. అనుకోకుండా వచ్చిన అవకాశంతో ఆమె కన్నడ నుంచి తెలుగు సినిమాల్లోకి ప్రవేశించింది. శ్రీకాంత్ తనయుడు రోహిత్ హీరోగా దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీలీల పెళ్లి సందడి సినిమా ద్వారా హీరోయిన్ అయ్యింది.
ఈ సినిమా జయాపజయాలు పక్కన పెడితే శ్రీలీలకు మాత్రం హీరోయిన్ గా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా ద్వారా ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు క్యూ కట్టాయి. హీరో రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించిన శ్రీలీల విడుదల అయినా ట్రైలర్స్, పాటల్లో దుమ్ము దులిపినట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమా విడుదల అయితే శ్రీలీల మరింత పైకి ఎదిగే అవకాశం పక్కాగా వుంది. ఇక శ్రీలీల వయసులో చిన్న అమ్మాయి అయినా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం పెద్ద ముదురు.
20 లక్షలతో మొదటి సినిమాలో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా 80 లక్షలు దాటేసి కోటికి చేరుకుంది. ఇక రానున్న సినిమాల కోసం ఏకంగా కోటి రూపాయలకి పైగానే తీసుకునే ఛాన్స్ వుంది. అతి తక్కువ కాలంలో మంచి పొజిషన్ కి చేరుకుంది. ఇక శ్రీలీల ధమాకా సినిమా తర్వాత వారాహి వారి జూనియర్ సినిమాతోనూ, అనగనగ ఒక రోజు అనే మరో తెలుగు సినిమాతోనూ అలరించబోతుంది. ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే శ్రీలీల చిన్ననాటి నుంచి తండ్రి ప్రేమ లేకుండానే పెరిగింది.
ఆమె తల్లి స్వర్ణలతకు తెలుగు వాస్తవ్యుడైన ఎన్నారై సూరపనేని శుభాకరరావు తో వివాహం జరిగింది. అయితే శ్రీలీల జన్మించడానికి ముందే వారికి విడాకులు జరిగాయి. తెలుగు సినిమాల్లో నటిస్తుంది కాబట్టి చాల మంది ఆమె సూరపనేని శుభాకర రావు కూతురు అని భావిస్తున్నారు. కానీ ఆమెకు తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ సూరపనేని శుభాకర రావు వివరణ కూడా ఇచ్చారు.ఇక ఆమె జీవితంలో ఎలాంటి వివాదాలు ఉన్నప్పటికీ శ్రీలీల పూర్తి ఫోకస్ సినిమాల పైనే పెట్టింది.
ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆమె సమాజం గురించి కూడా ఆలోచిస్తుంది. అనాధలకు సేవ చేయడానికి ఎప్పుడు ముందుండే శ్రీలీల ఇద్దరు వికలాంగులను దత్తత తీసుకొని మరి పెంచుతోంది. వారి చదువుల బాధ్యత, పెంపకం అన్ని కూడా శ్రీలీల దగ్గర ఉండి చూసుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే కోట్లు తీసుకుంటూ బాంబే చెక్కేసే చాల మంది హీరోయిన్స్ కన్నా కూడా శ్రీలీల చాల గొప్ప మనసు కలది. ఆమెకి జీవితంలో దొరకని ప్రేమని చివరికి కొంత మందికి అయినా పంచాలని చూడటం నిజంగా గ్రేట్