బుల్లితెరపై సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జబర్దస్త్ అనే కామెడీ షో లో యాంకర్ గా రష్మీ… కంటెస్టెంట్ గా సుధీర్ పరిచయమై వాళ్ళ కామెడీ ట్రాక్ తో జనాలకు బాగా దగ్గరైయ్యారు. ఈ క్రమంలోని ఆ తర్వాత ఢీ..పలు ఈవెంట్స్ లో జంటగా మెప్పించారు. అంతేకాదు వీళ్ళకి యూట్యూబ్ జోడి అని బిరుదు కూడా ఇచ్చేశారు . వీళ్ల మధ్య కెమిస్ట్రీ అంత బాగుంటుంది . రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగే నడుచుకుంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటారు .
అయితే దీనిపై ఇప్పటికే వీళ్ళని చాలామంది ప్రశ్నించగా ..వీళ్ళు మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని ..మాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. గాలోడూ ట్రైలర్ ఈవెంట్లో కూడా సుధీర్ కి ఇదే ప్రశ్న ఎదురైంది . రస్మితో మీ సంబంధం ఏంటి అని అడగ్గా.. “రష్మి నాకు బెస్ట్ ఫ్రెండ్.. ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ ..మేము మంచి ఫ్రెండ్స్ గానే ఉంటాం. బహుశా మేము చాలా ఏళ్ల నుంచి కలిసి వర్క్ చేస్తున్న క్రమంలో ఈ విషయాన్ని ఎవరు నమ్మడం లేదు.. కానీ నమ్మండి మేము ఫ్రెండ్స్ అంతే” అంటూ చెప్పుకు వచ్చారు .
ఇక రష్మి నటించిన సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సంధర్భంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలోను ఇదే ప్రశ్న ఎదురయింది. అప్పుడు రష్మీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.” నాకు సుధీర్ కి మధ్య ఉన్న రిలేషన్ షిప్ మా పర్సనల్ . ఈ విషయం ఎలా బయటపెడతాం . బయట పెడితే అది పరసనల్ ఎలా అవుతుంది “అంటూ కొత్త డౌట్లు పుట్టేలా ఆన్సర్ ఇచ్చింది . దీనితో ఒక్కసారిగా రష్మీ సుధీర్ పేర్లు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి . రష్మీ పరోక్షంగా వాళ్ళ రిలేషన్ ఇదే అని చెప్పిందంటే వీళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అంటూ చర్చించుకుంటున్నారు జనాలు.