టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన స్టైల్ లో విలన్ గా.. హీరోలకి తండ్రిగా ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . మరి ముఖ్యంగా తెరపై హీరో సిద్ధార్థ కు తండ్రి అంటే ప్రకాష్ రాజ్ ఉండాల్సిందే . ఒకానొక టైంలో వీళ్లు రియల్ తండ్రి కొడుకులా అని జనాలు చర్చించుకునేంతలా ఆకట్టుకుంటుంది వీరి నటన. అయితే మొదటి నుంచి ప్రకాష్ రాజ్ చాలా మెండి వాడు .
ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు. తనకు నచ్చితే ఓకే.. నచ్చకపోతే ఎలాంటి విషయాలో నైన కాంట్రవర్షీయల్ విషయాలల్లో నైన వేలు పెట్టి తిట్లు తింటాడు. మరీ ముఖ్యంగా మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ పై ఎంత నెగెటివిటీ క్రియేట్ అయిందో చూసాం. కాగా మా ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత ప్రకాష్ రాజ్ తన స్ట్రాటజీని మార్చారు . ఎలాంటి రోల్స్ లోనైనా సరే నటించి అవలీలగా మెప్పించే ప్రకాష్ రాజ్ కి పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం . అందుకే ఎక్కువగా పాలిటిక్స్ లో జరిగే విషయాలపై మాట్లాడుతూ ఉంటారు.
రీసెంట్ గా ఆయన మాట్లాడుతూ..” చాలామంది నటులు నాతో నటించడానికి ఇష్టపడట్లేదు.. భయపడిపోతున్నారు.. నాతో నటిస్తే ఎక్కడ తమ సినిమాను బ్యాన్ చేస్తారో అని ఓ రాజకీయ వర్గం నాపై కుట్ర చేస్తుంది. ఈ కారణంగానే నాకు సినిమా అవకాశాలు తగ్గాయి. అయినా నో ప్రాబ్లం.. నా నటన నచ్చిన వాళ్ళు ..నాకు అవకాశాలు ఇస్తారు. నాతో నటిస్తారు ..నాతో సినిమాల్లో కనిపిస్తే ఒక వర్గం ప్రేక్షకులు అంగీకరించరేమో అని భయపడుతున్నారు . దానికి నేను ఏమి బాధపడట్లేదు. అలాంటి వాళ్ళు నాకు దూరంగా ఉంటేనే మంచిది. అయితే కొన్ని విషయాలకు నేను వ్యతిరేకంగా మాట్లాడాలి లేదంటే కేవలం మంచి నటుడు గానే నేను చనిపోతాను. నాకు అలా చనిపోవడం ఇష్టం లేదు .
ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా మాట్లాడి తప్పు అనిపించుకున్న పర్లేదు ..అలా చనిపోవడమే నాకు ఇష్టం” అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. దీనంతటికీ కారణం ప్రకాష్ రాజ్ బిజెపి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్న కారణంగానే అని అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రధాని మోడీ ఆయన విధివిధానాలను ఎప్పుడు తప్పు పడుతూనే ఉంటారు . ఈ క్రమంలోనే బిజెపి పై ప్రకాష్ రాజ్ మండిపడుతూనే ఉంటారు. ఓ వైపు సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన బాధలో జనాలు ఉంటే..ప్రకాష్ రాజ్ లాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.