ఈ మధ్యకాలంలో మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారిన సంగతి గ్తెలిసిందే. తన వ్యక్తిగత కారణాల వల్ల ట్రోల్ అవుతున్న నిత్యామీనన్ ఈ మధ్యకాలంలో కాంట్రవర్షీయల్ విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. రీసెంట్గా ప్రెగ్నెన్సీ కిట్ తో పాజిటివ్ ఉన్న సైన్ ను చూపిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చిన నిత్యామీనన్.. రీసెంట్ గా బేబీ ఫోటోలు షేర్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది.
దీంతో ఒక్కసారిగా నిత్యామీనన్ అభిమానులకి మైండ్ బ్లాక్ అయ్యింది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం నిత్యామీనన్ ఓ మలయాళ చిత్రంలో గర్భిణీ పాత్రంలో కనిపించింది. దానికి సంబంధించిన పిక్స్ నే ఇవి. వండర్ ఉమెన్ సినిమాలో నిత్యా కూడా నోరా అనే గర్భిణిగా నటించింది. గర్భిణీ స్త్రీలు మార్గదర్శకత్వంలో మాతృత్వాన్ని పొందుతారు ..ఈ మలయాళం చిత్రం లో భాగంగానే నిత్యామీనన్ ఇలా బేబీ బంప్ , ప్రెగ్నెన్సీ కిట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని కన్ఫామ్ అయింది .
నాకు ప్రెగ్నెన్సీ లేదు అని స్పష్టం చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది నిత్యామీనన్ . “నిజంగా గర్భవతిని కాదు ..వండర్ ఉమెన్..లో గర్భవతి నోరా పాత్రలో నటించడం చాలా బాగుంది అన్నారు . కానీ ఒక్కటి నిజం ప్రెగ్నెన్సీ టైం చాలా కష్టంగా ఉంటుంది అని ..నాకు అర్థం అయింది.. అందుకే నోరా పాత్రకు సంబంధించిన కొన్ని పిక్స్ ఇలా పోస్ట్ చేశాను” అంటూ అభిమానులకి క్లారిటీ ఇచ్చింది ఈ బొద్దుగుమ్మ. ఏది ఏమైనా సరే ప్రెగ్నెంట్ కాదంటూ క్లారిటీ ఇచ్చిన ఇలాంటి చెత్త పనులు మరొకసారి చేయకు .. అభిమానులు షాక్ అవుతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.